CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CA Student Suspicious Death: హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సీఏ చదువుతున్న విద్యార్థి అద్దెకు ఉంటున్న గదిలోనే వేలాడుతూ శవమై కనిపించాడు. కానీ అతను వేసుకున్న టీ షర్ట్‌పై రక్తపు మరకలు ఉండటం.. యువకుడు మృతిపై అనుమానాలు రేకెత్తిస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. ఆ యువకుడి పేరు జనార్ధన్. కర్నూలు జిల్లాకు చెందిన జనార్థన్.. సీఎ బ్యాక్ లాగ్స్ ఉండటంతో హైదరాబాద్‌కు వచ్చాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ ఫ్లాట్స్‌లో మరో ఇద్దరితో కలిసి అద్దెకు ఉంటున్నాడు.
తోటి రూమ్ మేట్స్ జాబ్స్ చేసుకుంటుండగా.. జనార్థన్ బ్యాక్ లాగ్స్ క్లియర్ చేయాడానికి ప్రిపేర్ అవుతున్నాడు. రోజు మాదిరిగానే తమ రూమ్‌లో వంట చేసుకొని జనార్థన్‌కు చెప్పి గదికి మరో వైపు నుంచి తాళం వేసుకొని వెళ్లిపోయారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో రూమ్ వద్దకు వచ్చిన ఇద్దరు స్నేహితులు.. గదికి తాళం తీసి చూడగా.. ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. జనార్థన్ ధరించిన టీషర్ట్‌కు రక్తం ఉండటం.. నోట్లోంచి తీవ్ర రక్త స్రావం కావడంతో పోలీసులకు సమాచారం అందించారు.
Also Read
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
జనార్థన్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు స్నేహితులు. దీంతో హుటాహుటిన కర్నూల్ నుంచి బయల్దేరి వచ్చిన కుటుంబ సభ్యులు.. జనార్థన్ మృతి పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఉరేసుకుంటే నోట్లోంచి రక్తస్రావం ఎందుకు అవుతుందని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనార్దన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జనార్దన్ డెడ్‌బాడీని మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు జనార్థన్ డెడ్‌బాడీని అప్పగించారు పోలీసులు. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ కీలకంగా మారనుంది.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!