Uttar Pradesh: బీజేపీకి మద్దతు ఇస్తుందని దళిత యువతిని హత్య చేసిన ఎస్పీ నేత..
- ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం..
- బీజేపీకి మద్దతు ఇస్తుందని యువతి దారుణహత్య..
- సమాజ్‌వాదీ నేత హత్య చేసినట్లు కుటుంబం ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ ఉప ఎన్నికల వేఠ ఆ రాష్ట్రంలోని కర్హల్‌లోని కంజారా నది వంతెన సమీపంలో ఒక దళిత యువతి నగ్న మృతదేహం గోనె సంచిలో లభించడం సంచలనంగా మారింది. ప్రశాంత్ యాదవ్ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు, ఈ నేరం వెనక రాజకీయ ఉద్దేశ్యం ఉన్నట్లు యువతి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
హత్యకు ముందు యువతిపై అత్యాచారం చేశారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కర్హల్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని యువతి ప్రచారం చేసింది, ఇది ప్రశాంత్‌కి కోపం తెప్పించిందని కుటుంబం పేర్కొంది. బీజేపీకి మద్దతుగా నిలిచినందుకే ఈ హత్య చేశారని, సమాజ్ వాదీ(ఎస్పీ)కి ఓటు వేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రశాంత్ యువతిని బెదిరించినట్లు తెలుస్తోంది.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
Read Also: Nayanthara: నయనతార వెడ్డింగ్ సీన్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఎన్ని కోట్లు చెల్లించిందో తెలుసా?
కుటుంబం చెబుతున్న వివరాల ప్రకారం.. నవంబర్ 19న బెదిరింపులు వచ్చాయని, అదే రోజు ఇద్దరు నిందితులు యువతిని బైక్‌పై తీసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్ష్యలు తెలిపారు. బుధవారం ఆమె మృతదేహం గోనె సంచిలో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
మెయిన్‌పురి జిల్లాలో ఉన్న కర్హాల్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆ స్థానం ఖాళీ కావడంతో బుధవారం పోలింగ్ జరిగింది. 1993 నుండి సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటగా పరిగణించబడుతున్న పార్టీ అఖిలేష్ యాదవ్ మేనల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఈ స్థానం నుండి పోటీకి దింపింది. ఈ ఎన్నికల బీజేపీకి, ఎస్పీకి ప్రతిష్టాత్మకంగా మారింది. తేజ్ ప్రతాప్ యాదవ్ మామ అనుజేష్ యాదవ్‌ని బీజేపీ పోటీకి దింపింది. ఈ నియోజకవర్గంలో యాదవులు 1.4 లక్షల మంది ఉండగా, దళితులు 40,000, ముస్లింలు 15,000 మంది ఓటర్లు ఉన్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!