Bypoll Election Results: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు అందరి చూపు వయనాడ్, యూపీలో జరగబోయే ఉప ఎన్నికలపై నెలకొంది. వయనాడ్, రాయ్‌బరేలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గెలుపొందడంతో ఆయన వయనాడ్ సీటుని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో వయనాడ్‌లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ స్థానం నుంచి ప్రియాంకాగాంధీ పోటీలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. తొలిసారిగా ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ ఉప ఎన్నికల వేఠ ఆ రాష్ట్రంలోని కర్హల్‌లోని కంజారా నది వంతెన సమీపంలో ఒక దళిత యువతి నగ్న మృతదేహం గోనె సంచిలో లభించడం సంచలనంగా మారింది. ప్రశాంత్ యాదవ్ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు, ఈ నేరం వెనక రాజకీయ ఉద్దేశ్యం ఉన్నట్లు యువతి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.