Bihar: భోజనం ఆలస్యమైందని.. వదిన తల నరికి, ఇంటి ముందు వేలాడదీసిన వ్యక్తి..
- బీహార్ జెహానాబాద్‌లో మహిళ దారుణ హత్య.
- భోజనం ఆలస్యంగా వడ్డించిందని వదినపై దాడి చేసిన నిందితుడు.
- ఘటనలో మృతి చెందిన 25 ఏళ్ల అంశు దేవి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో జెహానాబాద్‌లో దారుణ సంఘటన జరిగింది. భోజనం ఆలస్యంగా పెట్టిందనే కోపంతో వదిన గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. హత్య తర్వాత ఆమె తలను నరికి ఇంటికి ముందు ఉన్న చెట్టుకు వేలాడదీశాడు. ఈ ఘటన గ్రామంలో భయాందోళనలు నింపింది. మృతురాలిని ఇమాద్‌పూర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల అంశు దేవిగా గుర్తించారు. ఆమె భర్త ధర్మంద్ర కుమార్. ఈ సంఘటన పార్స్ బిఘా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
నిందితుడు కునాల్ కుమార్ డ్రగ్స్‌కు బానిసగా మారినట్లు స్థానికులు వెల్లడించారు. ఘటన సమయంలో అంశు దేశి ఇంట్లో ఉండగా, మిగతా కుటుంబసభ్యులు పొలం పనుల కోసం వెళ్లారు. పొలం నుంచి ఇంటికి వచ్చని కునాల్ కుమార్ భోజనం పెట్టాలని కోరాడు. భోజనం వడ్డించడం ఆలస్యం కావడంతో ఆగ్రహానికి గురైన అతను గొడ్డలి తీసుకుని అంశుదేవిపై దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు వదిలింది.
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
హత్య అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోకుండా ఇంటి సమీపంలోనే కూర్చుని ఉన్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, హత్యకు దారితీసిన సంఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!