Conversion-S*x Racket: కిలాడీ సిస్టర్స్.. సె*క్స్, మతమార్పిడి దందా గుట్టురట్టు..
- మధ్యప్రదేశ్‌లో సంచలనంగా సె*క్స్, మతమార్పిడి దందా..
- మహిళల్ని ఉపాధి పేరుతో వంచిస్తున్న భోపాల్ సిస్టర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Conversion-S*x Racket: మధ్యప్రదేశ్‌లో భోపాల్ సిస్టర్స్ అరాచకాలు సంచలనంగా మారాయి. ఒకప్పుడు మురికివాడల్లో నివసించిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇప్పుడు కోట్లకు పడగలెత్తారు. అమాయకమైన, పేద అమ్మాయిలను ఉపాధి పేరుతో సె*క్స్ కుంభకోణంలోకి దించి, ఆ తర్వాత ఇస్లాంలోకి మారుస్తున్న ముఠా గుట్టురట్టైంది. ఈ కేసులో 21, 32 ఏళ్ల అమ్రీన్, అఫ్రీన్ అనే ఇద్దరు మహిళలతో పాటు వీరి సహచరుడు చందన్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు బిలాల్, చాను, యాసిర్ పరారీలో ఉన్నారు.
కిలాడీ సిస్టర్స్, సె*క్స్, మతమార్పిడి:
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
భోపాల్ నగరంలోని అబ్బాస్ నగర్‌లో సాధారణ మురికివాడలో ఉన్న ఇద్దరు నిందితురాళ్లు ఇటీవల నగరంలోని అత్యంత ఖరీదైన సాగర్ రాయల్ విలాస్‌లో విలాసవంతమైన విల్లాకు మారారు. యువతులను దోపిడీ చేయడం ద్వారా వచ్చిన అక్రమ సంపాదనతో వీరిద్దరు జల్సాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పేద అమ్మాయిలకు రూ. 10,000 జీతం, ఉచిత వసతి, ఆహారం, ఉన్నతమైన లైఫ్ స్టైల్ కల్పిస్తామని ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆశ చూపేవారు. ఆ తర్వాత వీరికి పబ్ కల్చర్ అలవాటు చేసి, డ్రగ్స్ ఇచ్చే వారు. ఇదే సమయంలో వారిపై లైంగిదాడి చేయించి, అభ్యంతరకరమైన ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేసే వారు. ఎదురుతిరిగితే చంపేస్తామని బెదిరించేవారు. ఈ కిలాడీ సిస్టర్స్ సన్నిహితుడు చందన్ యాదవ్, దోపిడీకి గురైన మహిళలతో ‘‘తాను ఇస్లాంలోకి మారును. మీరు కూడా మారితే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను’’ అని చెప్పేవాడు. వారిని మతంలోకి మార్చి బుర్ఖా ధరించి ప్రార్థనలు చేయాలని బలవంతం చేసేవాడు.
అరాచకాలు వెలుగులోకి:
ఛత్తీస్‌గఢ్‌లోని ముంగేలి జిల్లాకు చెందిన, బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న మహిళ ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. 2025 డిసెంబర్‌లో తనను పని నెపంతో అహ్మదాబాద్ తీసుకెళ్లారని ఆరోపించింది. అక్కడ అమ్రీన్ బంధువు యాసిర్ తనపై అత్యాచారం చేశాడని పేర్కొంది. బిలాల్, చాను వేర్వేరు సమయాల్లో లైంగిక దాడికి పాల్పడినట్లు వెల్లడించింది. అమ్రీన్ ఇంట్లో పనిమనిషిగా పనిచేసిన మరో మహిళ చందన్ యాదవ్ తనపై అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చసింది.
ఈ కేసులో అరెస్టుల తర్వాత పోలీసులు అమ్రీన్, అఫ్రీన్, చందన్ మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. అమ్రీన్ ఫోన్‌లో అనేక అనుమానాస్పద వాట్సాప్ గ్రూపులు కనుగొన్నారు. వాటిలో చాలా మంది యువతుల ఫోటోలు ఉన్నాయని ఆరోపించారు. తమను గుజరాత్, ముంబైకి తీసుకెళ్లి వివిధ సాకులతో అపరిచితులకు పరిచయం చేశారని బాధితులు చెబుతున్నందున దీనికి అంతర్రాష్ట్ర నెట్వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
-
Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్‌పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!