మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి దక్కుతుందనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణల మధ్య నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటించారు. జపాన్‌కు చెందిన నిహాన్ హిడాంకియో సంస్థ నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది. ఈ జపనీస్ సంస్థ ‘అణ్వాయుధాలు లేని ప్రపంచం’ని సమర్థిస్తుంది.
READ MORE: Bigg Boss: బిగ్ బాస్ కు షాక్ .. మహిళా కమిషన్ నోటీసులు!
వాస్తవానికి.. ఈ జపాన్ సంస్థ నిహాన్ హిడాంకియో రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన అణు బాంబు దాడుల బాధితుల కోసం పనిచేస్తోంది. అలాగే.. ఈ సంస్థ ప్రపంచం మొత్తం అణ్వాయుధాల నుంచి పూర్తిగా విముక్తి పొందేలా కృషి చేస్తుంది. ఇజ్రాయెల్-హిజ్బుల్లా యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య ఈ సంస్థకు 2024 నోబెల్ శాంతి బహుమతి లభించడానికి కారణం ఇదే. ఈ సంస్థ హిరోషిమా, నాగసాకి అణు బాంబు దాడుల బాధితులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. తమ అవార్డుతో హిరోషిమా, నాగసాకి అణుబాంబు బాధితులను గౌరవిస్తున్నట్లు నార్వేయన్ నోబెల్ కమిటీ తన ప్రకటనలో తెలిపింది.
READ MORE:Dussehra 2024: దసరా తిథి, ఆయుధ పూజలకు అనుకూలమైన సమయం?
నోబెల్ కమిటీ ప్రకారం.. అణు రహిత ప్రపంచాన్ని సమర్ధించడంలో, అణుయుద్ధం యొక్క భయానక పరిస్థితులపై ఈ సంస్థ చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతిని నార్వేజియన్ నోబెల్ కమిటీ నిహాన్ హిడాంకియోకు అందించింది. 1956లో ఏర్పడిన నిహాన్ హిడాంకియో జపాన్‌లో అణు బాంబు దాడుల నుంచి బయటపడినవారిలో అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన సంస్థ. అణ్వాయుధాల వినాశకరమైన మానవతా పరిణామాల గురించి ప్రపంచవ్యాప్త అవగాహన పెంచడం దీని లక్ష్యం.
READ MORE:Dussehra 2024: దసరా తిథి, ఆయుధ పూజలకు అనుకూలమైన సమయం?
అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త వ్యతిరేకతను సృష్టించడానికి, కొనసాగించడానికి నిహాన్ హిదండక్యో చేసిన తిరుగులేని ప్రయత్నాలకు నోబెల్ కమిటీ ప్రశంసించింది. జపాన్‌లో అణు బాంబు దాడులు జరిగి దాదాపు 80 ఏళ్లు గడిచినా అణ్వాయుధాలు ప్రపంచానికి ముప్పుగా మిగిలాయి. ఈ అవార్డు ప్రపంచ శాంతికి పెరుగుతున్న ముప్పులను గుర్తుచేస్తుంది. అణ్వాయుధాలను ఆధునికీకరిస్తున్నట్లు కమిటీ తెలిపింది. ఇదిలా ఉండగా.. నోబెల్ శాంతి బహుమతిని 1901 నుంచి ఇస్తున్నారు. ఇప్పటి వరకు 104 సార్లు ఆ పురస్కారాన్ని అందించారు. వ్యక్తులతో పాటు సంస్థలకు కూడా నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించారు. గత ఏడాది మహిళల హక్కులు, ప్రజాస్వామ్యం గురించి పోరాడిన ఇరాన్ సామాజిక కార్యకర్త నర్గెస్ మొహమ్మదీకి అవార్డును ఇచ్చారు.