Bengaluru: ఆదర్శ దంపతులు.. బాల్కనీలో గంజాయి సాగు..
- బాల్కనీలో గంజాయి సాగు చేస్తున్న జంట..
- ఫేస్‌బుక్ పోస్టుతో విషయం వెలుగులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: బెంగళూర్‌లో ఓ జంట తమ అపార్ట్‌మెంట్‌లోని బాల్కనీలోనే గంజాయి సాగు మొదలుపెట్టారు. సిక్కింకి చెందిన ఈ జంటన బెంగళూర్‌లో తాము నివాసం ఉంటున్న భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. సిక్కింకి చెందిన కె. సాగర్ గురుంగ్ (37), అతని భార్య ఊర్మిళ కుమారి (38) తమ బాల్కనీలోని రెండు కుండీల్లో అలంకార మొక్కలతో పాటు గంజాయిని నాటారు.
Read Also: Election Commission: ఎన్నికల ప్రచారంలో మహిళలపై అనుచిత పదజాలం చేస్తే ఊరుకోం..
Also Read
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
- Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
- Chamoli Tunnel Accident: చమోలీ సొరంగం ప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
అయితే, ఇటీవల ఉర్మిత తన బాల్కనీలో పెంచుతున్న వివిధ మొక్కలతో పాటు గంజాయి మొక్కల్ని చూపిస్తూ ఫేస్‌బుక్ వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది వైరల్‌గా మారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉర్మిళ బంధువు ఒకరు పోలీసులు వచ్చేలోపు కుండీలోని గంజాయి మొక్కల్ని తీసిపారేయాలని సూచించాడు. అయితే, పోలీసులు కుండీల్లో గంజాయి ఆకుల్ని గుర్తించారు.
54 గ్రాములు ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరింత విచారించగా, లాభసాటిగా విక్రయించాలనే ఆలోచనతోనే గంజాయిని పెంచుతున్నట్లు దంపతులు అంగీకరించారు. వీరు గంజాయిని అమ్ముతున్నారో లేదో తెలుసుకోవడానికి వారి మొబైళ్లను స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Realme P4s Lite: రియల్మీ P4s లైట్.. 7000mAh బ్యాటరీతో చౌకైన ఫోన్.. ఫీచర్లు అదిరిపోయేలా!
-
Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
-
India – Pakistan: మొదట భారత్ తరఫున ఆడి.. ఆ తర్వాత పాకిస్థాన్ తరఫున ఆడిన క్రికెటర్లు వీరే..!
-
Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
-
CM Vijay: “1967 నాటి తప్పు పునరావృతం కావొద్దు”.. ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ..
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!