Bengaluru: మహిళపై బైక్-టాక్సీ డ్రైవర్ లైంగిక వేధింపులు.. రూట్ మార్చి, కోపరేట్ చేయాలంటూ..
- మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న బైక్-టాక్సీ డ్రైవర్లు..
- బెంగళూర్‌లో మహిళపై రాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: ఇటీవల కాలంలో బైక్-ట్యాక్సీ రైడర్ల వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. రాత్రి సమయాల్లో గమ్యస్థానం వెళ్లేందుకు బైక్స్, ఆటో, కార్లు బుక్ చేసుకుంటున్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. బెంగళూర్‌లో 28 ఏళ్ల మహిళపై ఓ ర్యాపిడో డ్రైవర్ అర్ధరాత్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన జూలై 5న రాత్రి 11.40 గంటల నుంచి అర్ధరాత్రి 12.00 గంటల మధ్య జరిగిందిన బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
Read Also: MP High Court: భార్య వంట చేయకపోవడం, భర్తను బట్టలు ఉతకమనడం.. ఆత్మహత్యకు కారణాలు కావు..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
సర్జాపూర్ రోడ్‌లోని రాధారెడ్డి లేఅవుట్‌లో నివాసం ఉంటున్న మహిళ ఓ హోటల్‌లో స్టోర్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తోంది. అదే హోటల్‌లో ఆమె భర్త కూడా పనిచేస్తున్నట్లు బెల్లందూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి 11.20 గంటలకు ఇంటికి వెళ్లేందుకు బైక్ టాక్సీని బుక్ చేసుకున్నట్లు చెప్పారు. 20 ఏళ్ల బిస్వజిత్ నాథ్ బైక్ డ్రైవర్‌గా చెప్పింది. ఇంటికి వెళ్తున్న సమయంలో వర్షపు నీరు ఎక్కువగా ఉందని వేరే రహదారి తీసుకుంటున్నట్లు పేర్కొంటూ బిస్వజిత్ తన మార్గాన్ని మార్చాడని, ఆ సమయంలో తాను తన స్నేహితురాలితో బెంగాలీలో మాట్లాడానని, బిస్వజిత్ తనను బెంగాలీ అని అడిగి మాట కలిపినట్లు చెప్పింది. ఇంతలోనే ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అసభ్యంగా తాకుతూ కోపరేట్ చేయాలని కోరాడని, తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే చెంప కొట్టాడని మహిళ పేర్కొంది.
తన మొబైల్ ఫోన్, నగదు తీసుకున్నాడని, తనను ఏం చేయొద్దని అతడిని వేడుకున్నట్లు చెప్పింది. దాదాపుగా 30 నిమిషాల పాటు ఎంతకీ లొంగలేదని, తనను ఇంటి వద్ద లేకపోతే ఏదైనా లోకేషన్ వద్ద డ్రాప్ చేయాలని కోరానని చెప్పారు. నిందితుడు తనను ఆర్ఎంజెడ్ ఎకో వరల్డ్ వద్ద దించేసి, మొబైల్ ఫోన్ ఇచ్చేసి రూ. 800 తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. అయితే, అతడి బైక్ నెంబర్ నోట్ చేయలేదని, రాపిడోకి ఫిర్యాదు చేసి, అతడి పేరు బిశ్వజిత్‌గా చెప్పానని, వారు నిందితుడిని తొలగిస్తామని చెప్పారని పేర్కొంది. అతడి పేరు, నంబర్ ఇతర వివరాలు ఇవ్వడంతో అతడిపై ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.
తాజావార్తలు
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!