హైదరాబాద్‌లోని బేగంపేట యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) శాఖలో జరిగిన ఒక భారీ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనపై ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, ఒక ఎన్ఆర్ఐ (NRI) ఖాతా నుండి ఏకంగా రూ. 7 కోట్లు కాజేసిన బ్యాంక్ మేనేజర్‌ను పోలీసులు ఎట్టకేలకు కటకటాల వెనక్కి పంపారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఒక ప్రవాస భారతీయుడికి బేగంపేట యాక్సిస్ బ్యాంక్ శాఖలో ఖాతా ఉంది. ఈ ఖాతాను పర్యవేక్షిస్తున్న బ్యాంక్ మేనేజర్ వెంకట్ రమణ, సదరు బాధితుడి నమ్మకాన్ని చూరగొన్నాడు. అయితే, అతని కన్ను బాధితుడి ఖాతాలోని భారీ నిల్వలపై పడింది. దీంతో పథకం ప్రకారం బాధితుడి సంతకాన్ని ఫోర్జరీ చేస్తూ, చెక్కుల సాయంతో విడతల వారీగా డబ్బులు డ్రా చేయడం మొదలుపెట్టాడు.
Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!
నిందితుడు వెంకట్ రమణ ఒక్కసారిగా కాకుండా, ఎవరికీ అనుమానం రాకుండా 41 విడతల్లో మొత్తం 7 కోట్ల రూపాయలను కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ స్కామ్‌లో మేనేజర్‌తో పాటు బ్యాంక్‌లో పనిచేస్తున్న మరికొందరు కింది స్థాయి సిబ్బంది ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం. తన ఖాతాలో డబ్బులు మాయమైనట్లు గుర్తించిన బాధితుడు 2024లోనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా, నిందితుడు వెంకట్ రమణ సహకరించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.
Asha Bhosle: ఆశా భోస్లే సంపాదన వింటే షాక్ అవ్వాల్సిందే!
పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పంజాగుట్ట పోలీసులు, ఎట్టకేలకు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో నిందితుడికి సహకరించినట్లు భావిస్తున్న మరో ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. బ్యాంకుల్లో నిక్షిప్తమై ఉన్న ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన బాధ్యత గల ఉన్నతాధికారే ఇలాంటి మోసానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.