AP Crime: రూ.4 కోట్లు ముంచిన రాంగ్ కాల్..!
- ఓ రాంగ్ కాల్ విలువ అక్షరాల 4 కోట్ల రూపాయలు..
- తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో మహిళాకు ముచ్చేమటలు..
- రూ. 4 కోట్లు వదిలించింది.. ఏళ్ల పాటు నరకం చూపించింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: కొన్ని రాంగ్ కాల్స్.. కొందరికి కొత్త పరిచయాలను అందిస్తే.. మరికొందరి జీవితాల్లో ప్రేమ చిగురించేలా చేయడం.. ఇంకా కొందరి జీవితాలను సర్వనాశనం చేసిన సందర్భాల్లో ఎన్నో చూశాం.. తాజాగా, ఓ రాంగ్ కాల్ విలువ అక్షరాల 4 కోట్ల రూపాయల వరకు వెళ్లింది.. ముక్కు మొహం తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఆ మహిళాకు ముచ్చేమటలు పట్టించింది.. సుమారు రూ. 4 కోట్లు వదిలించింది.. ఏళ్ల పాటు నరకం చూడాల్సిన పరిస్థితి వచ్చింది..
Read Also: UP: ‘‘ముస్లింలు మాత్రమే కాదు, హిందువులు కూడా’’.. రోడ్‌లపై నమాజ్ ఆపడంతో నిరసన..
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 8 ఏళ్ల క్రితం ఓ రాంగ్ కాల్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మహిళతో పరిచయం ఏర్పరుచుకున్నాడు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన అక్షయ్ కుమార్ అనే వ్యక్తి.. ఆ పరిచయం కాస్తా వారి మధ్య సన్నిహిత్యాన్ని పెంచింది.. కన్నింగ్ ఐడియాలతో ఉన్న అక్షయ్ కుమార్.. ఆమెతో పర్సనల్‌గా ఉన్న సమయంలో వీడియోలను రికార్డ్ చేశాడు.. ఇక, కొంత సమయం తర్వాత అతడి నిజస్వరూపాన్ని బయటపెట్టాడు.. బాధితురాలితో పర్సనల్‌గా తీసుకున్న వీడియోలను చూపించి బెదిరించసాగాడు.. దఫా దఫాలుగా డబ్బులు వసూలు చేశాడు.. ఇలా నాలుగు కోట్ల రూపాయల నగదు, 800 గ్రాముల బంగారు ఆభరణాలు కాజేసి జల్సాలు చేయసాగాడు.. అంతే కాదు, తన కోరిక తీర్చాలంటూ పదేపదే వేధింపులు గురిచేసేవాడు.. ఓ వైపు బ్లాక్‌మెయిల్‌తో కోట్లలో డబ్బులు.. మరోవైపు.. వేధింపులు ఆగకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులు ఆశ్రయించారు.. విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ ఘటనపై కేసు నమోదు అయింది.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అక్షయ్ కుమార్ తిరుపతిలో ఉన్నట్లు గుర్తించారు.. తిరుపతిలో అరెస్టు చేసి విశాఖకు తరలించారు పోలీసులు.. నిందితుడు వద్ద నుండి 65 గ్రాముల బంగారం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడంతో పాటు బ్యాంకులో ఉన్న సుమారు రెండు కోట్ల రూపాయల నగదు సీజ్ చేశారు. కొత్త వ్యక్తులతో.. తెలియనివారితో.. పరిచయాలు ఏర్పడినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు..
తాజావార్తలు
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
-
వరంగల్ MGMలో ఒక్కసారిగా కుప్పకూలిన సీలింగ్.. ముగ్గురికి గాయాలు!
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!