Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantapur Honey Trap Case: అనంతపురంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఉపసర్పంచ్ నరేందర్ రెడ్డిని పోలీసులు కీలక సూత్రధారిగా అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. హనీ ట్రాప్ కేసులో ఇప్పటికే అరెస్టయిన నిందితులతో నరేందర్ రెడ్డి పలుమార్లు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. మొబైల్ ఫోన్ కాల్ డేటా, వాయిస్ రికార్డుల ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించినట్లు సమాచారం. కేసులో కొత్త ఆధారాలు బయటపడటంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నరేందర్ రెడ్డిని ప్రశ్నిస్తున్న అధికారులు, ఈ వ్యవహారంలో ఆయన పాత్ర ఎంతవరకు ఉందనే దానిపై దృష్టి సారించారు.
Read Also: Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
Also Read
- Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
- Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
- ATM Cash Van : ఏటీఎంలో డబ్బులు పెట్టాల్సినోడు.. తన జేబులో వేసుకుని జంప్.!
- Pune: పూణెలో మరో సోనమ్.. పెళ్లికి ముందే కాబోయే భర్తను పైకి పంపేసింది
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, నరేందర్ రెడ్డిని రేపు మీడియా ముందుకు తీసుకురావచ్చని తెలుస్తోంది. విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఈ పరిణామంతో అనంతపురం జిల్లాలో రాజకీయంగా కూడా చర్చలు మొదలయ్యాయి. హనీ ట్రాప్ కేసులో మరిన్ని ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశముందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కాగా, గత కొంతకాలంగా ప్రముఖులే టార్గెట్‌గా సాగుతున్న హనీట్రాప్ వ్యవహారం బట్టబయలైన విషయం విదితమే.. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందుతులను అరెస్ట్ చేశారు పోలీసులు.. కింగ్ రంగమ్మ నాయుడు అలియాస్ చిన్ని నాయుడమ్మతో పాటూ దబ్బర రాజేష్, జయలక్ష్మి, మల్లేశ్వరి, అనంత కుమారిని అరెస్ట్ చేశారు. ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇక, ఈ ముఠా ఇప్పటివరకు పలువురిని హనీ ట్రాప్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.. పోలీసులు చెబుతున్న ప్రకారం.. ప్లాన్ చేసి అమాయకులను, బాగా డబ్బున్నవాళ్లకు వల వేసి ట్రాప్ చేసేవారని.. ఆ తర్వాత బెదిరింపులకు దిగేవారని.. వారికి చాలా మంది బాధితులు లక్షలాది రూపాయలు సమర్పించుకున్నారని పోలీసులు చెబుతున్నారు.. ఇక, నిందితుల వద్ద నుంచి రూ.13 లక్షల నగదు, రెండు కత్తులు, అలాగే ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్‌లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్‌తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!