Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Driver Subrahmanyam Murder Case: కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సర్పవరం ఇన్ఛార్జ్ సీఐ రవికుమార్‌పై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. ఇన్ఛార్జ్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన మూడు రోజులకే రవికుమార్‌ను వీఆర్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు తమను బెదిరిస్తున్నారని కొందరు సాక్షులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే, ఆ విషయాన్ని సీఐ రవికుమార్ ఎమ్మెల్సీకి చేరవేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: IPL 2026: ‘మీరు మారిపోయారు సార్’.. లక్నో ఓడినా పంత్‌ను హత్తుకున్న ఓనర్ సంజీవ్ గోయెంకా..
Also Read
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
గత, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ అనంతబాబుతో సీఐ రవికుమార్‌కు సత్సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కారణాలతోనే ఆయనను కేసు దర్యాప్తు నుంచి తొలగించినట్లు సమాచారం. ఇకపై డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తు బాధ్యతలను తుని రూరల్ సీఐ చెన్నకేశవరావుకు అప్పగించారు. కేసు విచారణను వేగవంతం చేసి, నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగించాలని ఉన్నతాధికారులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం కాకినాడ జిల్లా పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!