తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ఓ వ్యక్తిని హతమార్చారు. ఈ ఘటన NTR జిల్లా రెడ్డిగూడెంలో జరిగింది. వారం రోజుల క్రితం జరిగిన తాపీ మేస్త్రి రామారావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు కోట రామారావు. NTR జిల్లా ఏ. కొండూరు మండలంలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. రెడ్డిగూడెంలోని మద్దులపర్వ ఇతని స్వస్థలం. ఇతను జూన్ 26 నుంచి కనిపించడం లేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు..
READ MORE: MK Stalin: భాషా ఉద్యమం తమిళనాడు దాటింది.. ఠాక్రేల కలయికపై స్టాలిన్..
జూన్ 29న కొత్త రేపుడిలోని ఓ మామిడితోటలో గుర్తు తెలియని మృతదేహం ఉందనే సమాచారం వచ్చింది. దాన్ని రామారావు కుటుంబ సభ్యులకు చూపించగా ఆనవాళ్లు గుర్తించారు. దీంతో రామారావు డెడ్ బాడీగానే ధృవీకరించారు పోలీసులు. ఈ కేసులో విచారణ చేపట్టగా.. పక్కా ప్రణాళిక ప్రకారం మర్డర్ చేసినట్లు తెలిసింది. ఏ. కొండూరు మండలం తూర్పు మాధవరానికి చెందిన ఆదూరి చార్లెస్, రెడ్డిగూడెం మండలం కోనపరాజు పర్వ గ్రామస్థురాలు బత్తుల కుమారి ఈ హత్య చేసినట్టు గుర్తించి ఇద్దరిని అరెస్టు చేశారు.. నిందితులైన చార్లెస్, కుమారి మధ్య ఎప్పటినుంచో వివాహేతర సంబంధం ఉంది.
READ MORE: NTR- Trivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా కోసం స్టార్ విలన్?
అయితే రామారావుకు కూలి పనుల చేసే చోట కుమారితో పరిచయం ఏర్పడింది. దీంతో కుమారిని తన కోరిక తీర్చాలంటూ కొన్ని నెలలుగా రామారావు తీవ్రంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని కుమారి చార్లెస్‌కు చెప్పటంతో ఇద్దరు రామారావును హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా జూన్ 26న రామారావును తీసుకొని కుమారి.. కొత్త రేపూడిలోని మామిడి తోటకు వెళ్లింది. అక్కడ పక్కా ప్లాన్ ప్రకారం చంపేశారు. లైంగిక వేధింపులు సహా ఇతరత్రా ఎలాంటి కేసు అయినా తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు పోలీసులు. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దంటున్నారు..