Vijayawada Crime: సోషల్ మీడియాలో కుప్పకుప్పలుగా కేటుగాళ్లు ఉన్నారు.. కొందరి బలహీనతనే పెట్టుబడిగా మార్చుకుని.. మోసాలకు పాల్పడుతున్నారు.. మరి కొందరు ఎర వేసి.. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.. తాజాగా విజయవాడలో సినిమా పేరుతో ఓ యువతికి సోషల్ మీడియా వేదికగా ఆశపెట్టిన ఓ యువకుడు.. ఆ తర్వాత తన అసలు రూపాన్ని బయటపెట్టాడు.. సినిమా ఆడిషన్స్ అంటూ పిలిచాడు.. ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. బాధితురాలు, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది..
Read Also: Election Results: నేడు 3రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఏ పార్టీ జెండా ఎగిరేనో..?
విజయవాడలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సినిమా ఆడిషన్స్ పేరుతో మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.. సినిమా ఛాన్స్ ఇప్పిస్తానంటూ యువతికి ఇన్ స్టాలో పరిచయం చేసుకున్నాడు విజయవాడకు చెందిన సాయితేజ.. బీసెంట్ రోడ్ లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న సాయి తేజ.. విజయవాడకు చెందిన యువతికి సినిమాలో అవకాశం అంటూ ఎర వేశాడు.. ఇక, సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని నమ్మబలికాడు.. తన ప్లాన్ ప్రకారం.. యువతిని లాడ్జికి రప్పించాడు.. లాడ్జిలో ఆ యువతిపై అత్యాచారయత్నం చేశాడు.. అయితే, సాయితేజ నుంచి తప్పించుకున్న బాధితురాలు.. ఇంటికి వెళ్లి.. జరిగిన ఘటనకు తన తల్లికి చెప్పి గోడున విలపించింది.. ఆ తర్వాత బాధితురాలు, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన గవర్నర్ పేట పోలీసులు.. నిందితుడు సాయిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఎవ్వరినీ పడితేవారిని నమ్మి.. మోసపోవద్దు అని సూచిస్తున్నారు పోలీసులు.