రోజురోజుకు సమాజంలో కామాంధులు ఎక్కువైపోతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి వావివరుసలు మరుస్తున్నారు.. లింగ బేధాలను పట్టించుకోవడంలేదు.. చివరికి ముగా జీవాలను కూడా వదలడం లేదు. తాజాగా ఒక కామాంధుడు కామంతో ముగా జీవమైన ఆవుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన హర్యానా లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. సోనీపత్ ప్రాంతంలో ఉత్తర ప్రదేశ్ కి చెందిన ఒక యువకుడు నివసిస్తున్నాడు. ఇటీవల అతడు ఇంటి దగ్గరకు వచ్చిన ఆవుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బలవంతంగా ఆవుపై పడి రేప్ చేయడానికి ప్రయత్నించాడు. ఏది గమనించిన స్థానికులు యువకుడిని పట్టుకొని దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు పట్టించారు. మూగజీవంపై యువకుడు చేసిన అఘాయిత్యానికి అతడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు.