Body Found In Drum: పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా నగరంలో ఓ భయానక సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే, ఓ నీలి రంగు డ్రమ్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసుల ఆ డ్రమ్ లోపల ఓ ప్లాస్టిక్ సంచిలో చుట్టి ఉన్న కుళ్ళిపోయిన మానవ మృతదేహం బయటపడింది. దీనిపై స్టేషన్ హౌస్ ఆఫీసర్ కుల్వంత్ కౌర్ మాట్లాడుతూ.. ఈ శవాన్ని చూస్తుంటే వలస వచ్చిన వ్యక్తిగా తెలుస్తోంది.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సివిల్ హాస్పిటల్‌లోని మార్చురీకి పంపించాం.. శరీరంపై ఎలాంటి గాయాల గుర్తులు లేవు.. పోస్ట్‌మార్టం తర్వాత మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని చెప్పుకొచ్చారు.
Read Also: WI vs AUS: రసవత్తరంగా సాగుతున్న విండీస్, ఆసీస్ టెస్ట్ మ్యాచ్.. స్వల్ప లీడ్‌లో విండీస్
అయితే, హత్యకు ముందు డ్రమ్‌ను కొనుగోలు చేసి ఉండవచ్చనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో లూథియానాలోని 42 డ్రమ్ తయారీ దుకాణాల జాబితాను సిద్ధం చేసి.. చాలా డ్రమ్ షాప్స్ ఓనర్లను ప్రశ్నిస్తున్నారు. ఇక, నేరం జరిగిన ప్రదేశం చుట్టూ పెద్ద సంఖ్యలో వలసదారులు నివసిస్తున్నారు.. వారిని కూడా విచారిస్తున్నాము అని SHO కుల్వంత్ కౌర్ అన్నారు. అలాగే, నేరం జరిగిన 5 కిలోమీటర్ల పరిధిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం.. ఇక, అనుమానాస్పదంగా కనిపించే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్‌లను సైతం తనిఖీ చేస్తున్నామని వెల్లడించారు.