WI vs AUS: వెస్టిండీస్ బ్రిడ్జ్ టౌన్ వేదికగా జరుగుతున్న వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. ఈ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 92/4 స్కోరు వద్ద నిలిచింది. దీనితో మొదటి ఇన్నింగ్స్ ఆధారంగా ఆస్ట్రేలియా 82 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆట ముగిసే సమయానికి ట్రావిస్ హెడ్ 13 పరుగులు, వెబ్ స్టర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే..
Read Also:IND vs AUS: నాలుగు నెలల సమయం ఉన్నా.. హాట్‌కేకుల్లా మ్యాచ్ టికెట్లు! ఒక్కడే 880 టిక్కెట్లు
ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్ లో ఉస్మాన్ ఖవాజా 47 పరుగులు, ట్రావిస్ హెడ్ 59 పరుగులతో మినహా ఇతరులంతా విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో జెడెన్ సీల్స్ ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అతడి భీకర బౌలింగ్ కు ఆసీస్ పేకముకల్లా టాప్ ఆర్డర్ పెవిలియన్ బాట పట్టింది. కేవలం 60 పరుగులు ఇచ్చి 5 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశారు. మరోవైపు విండీస్ సంచలనం శమర్ జోసెఫ్ కూడా మరోసారి తన ప్రతాపం చూపించాడు. అతడు 46 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు నేలకూల్చాడు.
Read Also:Puri Rath Yatra 2025: నేడే పూరీ జగన్నాథుని రథయాత్ర.. భారీగా భద్రతా ఏర్పాట్లు..
ఇక తక్కువ పరుగులకే ఆసీస్ ను కట్టడి చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. ఎందుకంటే వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగులకె ఆలౌట్ అయ్యింది. దీనితో కేవలం 10 పరుగుల లీడ్ మాత్రమే లభించింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో షై హోప్ 48, రోస్టన్ చేస్ 44 పరుగులతో రాణించారు. ఇక ఆసీస్ బౌలింగ్ లో మిచెల్ స్టార్క్ 3 , కమిన్స్ 2, హేజిల్‌వుడ్ 2 వికెట్లను నేలకూల్చారు.
మొదటి ఇన్నింగ్స్ లో తడబడ్డ ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లోను తడబడింది. ఈ ఇన్నింగ్స్ లో సామ్ కొన్స్టాస్ 5, ఉస్మాన్ ఖవాజా 15, జోష్ ఇంగ్లిస్ 12, కామెరూన్ గ్రీన్ 15 పరుగులతో మరోసారి నిరాశపరిచారు. వెస్టిండీస్ బౌలర్లు లో శమర్ జోసెఫ్, జెడెన్ సీల్స్, అల్జారీ జోసెఫ్, గ్రీవ్స్ చెరో వికెట్ తీసుకున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 92 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో నేడు జరగబోయే మూడో రోజు ఫలితం వచ్చేలా కనపడుతోంది.