Crime: మదర్సాలో షాకింగ్ ఘటన.. సెలవు కోసం 5 ఏళ్ల చిన్నారి హత్య!.. నిందితులు 11, 9ఏళ్ల చిన్నారులే..
- దేశ రాజధాని ఢిల్లీలోని ఓ మదర్సాలో షాకింగ్ కేసు
- సెలవు కోసం 5 ఏళ్ల చిన్నారి హత్య
- ఇద్దరు 11 ఏళ్ల చిన్నారులు.. 9 ఏళ్ల చిన్నారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ మదర్సాలో షాకింగ్ కేసు వెలుగు చూసింది. ఒక రోజు సెలవు కోసం 5 ఏళ్ల చిన్నారిని హత్య చేశారు. దయాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలిమ్ ఉల్ ఖురాన్ అనే మదర్సాలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నారి హత్య కేసులో ఇద్దరు 11 ఏళ్ల చిన్నారులు, 9 ఏళ్ల చిన్నారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సమాచారం ప్రకారం.. 5 ఏళ్ల చిన్నారి రుహాన్ మదర్సాలో అపస్మారక స్థితికి చేరాడు. దీంతో మదర్సా డైరెక్టర్ తల్లికి ఫోన్ చేసి, చిన్నారి ఆరోగ్యం గురించి తెలియజేశారు. తల్లి మదర్సాకు చేరుకుని రుహాన్‌ను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ డాక్టర్ బిడ్డను పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. చిన్నారి మృతి చెందడంతో మదర్సా బయట నిరసనలు వ్యక్త మయ్యాయి.
READ MORE: Rahul Gandhi: మిస్ ఇండియా జాబితాలో దళిత, గిరిజన, ఓబీసీ మహిళలు ఎందుకు లేరు?
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గురు తేగ్ బహదూర్ ఆసుపత్రి మార్చురీలో భద్రంగా ఉంచి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడు పోస్టుమార్టం నివేదికలో చిన్నారి హత్యకు గురైనట్లు తేలింది. దీని తర్వాత.. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. పోలీసులు అదే మదర్సాలో చదువుతున్న ముగ్గురు పిల్లలను హత్య ఆరోపణలపై అరెస్టు చేశారు. జిల్లా డీసీపీ డాక్టర్ జాయ్ టిర్కీ తెలిపిన వివరాల ప్రకారం.. రుహాన్ 5 నెలల క్రితం ఈ మదర్సాలో చదువుకోవడానికి వచ్చింది. ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో రుహాన్ కుటుంబం నివసిస్తోంది. చిన్నారి తండ్రి ఉత్తరప్రదేశ్‌లో నివసిస్తున్నాడు. భార్య, పిల్లలను కలవడానికి నెలకు ఒకసారి ఢిల్లీకి వస్తాడు. అదే మదర్సాలో చదువుతున్న మరో ముగ్గురు చిన్నారులు రుహాన్ అనే చిన్నారిని అసభ్యంగా ప్రవర్తించి హత్య చేసినట్లు విచారణలో తేలింది. మరణానంతరం మదర్సాలో ఒకరోజు సెలవు ఉంటుందని, ఆ తర్వాత ఇంటికి వెళ్లవచ్చని వారు భావించారు. నిందితులైన చిన్నారులను పోలీసులు పట్టుకున్నారు. మదర్సాలో 250 మంది పిల్లలు మత విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఘటన తర్వాత సమీపంలో నివసిస్తున్న తల్లిదండ్రులు ఈ మదర్సా నుంచి తమ పిల్లలను సురక్షితంగా వారి ఇళ్లకు తిరిగి తీసుకువెళ్లారు.
తాజావార్తలు
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
Bank Strike Update: మూడు రోజుల సమ్మె వాయిదా.. కీలక కమిటీ ఏర్పాటు.. బ్యాంకులకు ఇక 5 రోజుల పని విధానమా?
-
Astrology: సెప్టెంబర్ 28 సోమవారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?