చాలామంది తమ ఇష్ట దైవానికి ఇష్టమైన రోజున ఉపవాసం ఉంటారు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి
ఉపవాసం చేయడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. ఎక్కువ రోజులు ఆరోగ్యంగా జీవించగలుగుతారు.
ఉపవాసం వల్ల.. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
ఉపవాసం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.
ఉపవాసం ఉంటే.. మెదడు చాలా యాక్టివ్‌గా పని చేస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి.
ఉపవాసం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. ఎల్లప్పుడూ యవ్వనంగా, చాలా అందంగా కనిపిస్తారు.
ఉపవాసం చేస్తే.. ఆకలిపై నియంత్రణ ఉంటుంది. ఫలితంగా అధిక బరువు పెరగకుండా చూసుకోవచ్చు.
శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుముఖం పడతాయి.
క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని, కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది.
ఉపవాసం వల్ల శరీంలోని ఇన్ ఫ్లమ్మేషన్ తగ్గుతుంది. దీనివల్ల గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుంది.
ఉపవాసం కాలేయంకి బ్రేక్ దొరుకుతుంది కాబట్టి.. అది మలినాలు, వ్యర్థాలను శరీరం నుంచి తొలగిస్తుంది.