Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema Reviews Saamanyudu Telugu Movie Review

రివ్యూ : `సామాన్యుడు’

Published Date :February 4, 2022 , 1:52 pm
By Prakash
రివ్యూ : `సామాన్యుడు’
  • Follow Us :
  • google news
  • dailyhunt

విడుదల తేదీ: ఫిబ్రవరి 4
జానర్: యాక్షన్ థ్రిల్లర్
నటీనటులు: విశాల్, డింపుల్ హయతి, యోగిబాబు, మారిముత్తు, తులసి, రాజా, బాబూరాజ్, ఇలంగో కుమారవేల్, రవీనా రాజ్
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: కావిన్ రాజ్
నిర్మాత: విశాల్
రచన, దర్శకత్వం: తు.పా. శరవణన్

గత కొంత కాలంగా వరుస పరాజయాలతో కెరీర్ లో వెనుకబడిపోయాడు విశాల్. ఈ నేపథ్యంలో తనే నిర్మాతగా తు.పా. శరవణన్ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘వీరమే వాగై సూడుమ్’. దీనిని తెలుగులో ‘సామాన్యుడు పేరుతో విడుదల చేశారు. శుక్రవారం ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. నిర్మాతగాను, హీరోగాను ఈ సినిమా విజయం విశాల్ కి ఎంతో కీలకం. మరి ‘సామాన్యుడు’గా విశాల్ ఏ మేరకు మెప్పించాడో చూద్దాం.

‘సామాన్యుడు’ అన్న టైటిల్ జ‌నాన్ని ఆకట్టుకునేదే. ఎందుకంటే కోట్లాది జ‌నాల్లో అత్యధికులు సామాన్యులే. 2006లో జ‌గ‌ప‌తిబాబు ‘సామాన్యుడు’గా జ‌నం ముందు నిల‌చి జనం మది గెలిచే ప్రయత్నం చేసి కొంత వరకూ సఫలీకృతుడు అయ్యాడు. ఇప్పుడు మ‌ళ్ళీ అదే టైటిల్ తో విశాల్ ‘సామాన్యుడు’గా ప్రేక్షకుల ముందు నిలిచాడు. ‘Not a Common Man’ అనేది ఈ సినిమా ట్యాగ్.
ఇందులో క‌థానాయ‌కుడు సామాన్యుడు. అంటే ఓ మ‌ధ్య త‌ర‌గ‌తివాడు. సబ్ ఇన్ స్పెక్టర్ కావాలన్నది తనతో పాటు తండ్రి(మారిముత్తు) కోరిక. తల్లి (తులసి), చెల్లి (రవీనా రావి)తో కలసి బతికే పోరస్ (విశాల్) సొసైటీలో జరిగే అన్యాయాలను ఎదుర్కోవాలని భావిస్తుంటాడు. అయితే తండ్రి మాత్రం నేరం చేసే వారిని అడ్డుకోవడం కోసం చేసే నేరం కూడా ఇన్ స్పెక్టర్ కావాలనే కొడుకుకి ప్రతిబంధకంగా మారుతుందని చెబుతూ వస్తాడు. ఈ నేపథ్యంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీ వల్ల జనం పడే ఇబ్బందులు తెలియచేయటమే కాకుండా సొసైటీ ముందుంచే ప్రయత్నం చేస్తుంటాడు ఇలంగో కుమరవేల్. అది ఎం.పి కావాలని కలలు కనే ఆ ఫ్యాక్టరీ ఓనర్ నీలకంఠం(బాబూరాజ్) కి ప్రతిబంధకంగా మారుతుంది. దాంతో కుమరవేల్ ను హత్య చేస్తాడు నీలకంఠం. దానిని కళ్ళారా చూసిన హీరో చెల్లెలుకి ఎలాంటి గతి పడుతుంది. హీరో పోలీస్ కాకముందే తన చెల్లెలి హత్యను ఛేదించటానికి ఏం చేశాడు. చివరికి దుండుగులను పట్టుకుంటాడా? పోలీస్ గా మారతాడా? అన్నదే కథాంశం.

ఒక‌ప్పుడు పోలీస్ ఉద్యోగం అంటే గౌర‌వంతో కూడుకున్నది. ఇప్పుడు పోలీస్ అంటే జ‌నం భ‌య‌ప‌డేలా ఉంద‌ని క‌మెడియ‌న్ యోగిబాబుతో చెప్పక‌నే చెప్పించారు. విశాల్ న‌టించి, నిర్మించిన ఈ చిత్రంలో ఆయ‌న‌ స‌ర‌స‌న డింపుల్ హ‌యాతి నాయిక‌గా న‌టించింది. విశాల్ కు ఖాకీ పాత్రలు కొత్తేమీ కాదు. సో రొటీన్ గా సాగిపోతుంది తన పాత్ర. హీరో స్నేహితుడుగా నటించిన యోగిబాబుకు ఇలాంటి పాత్రలు కొట్టినపిండే. హీరోయిన్ గా డింపుల్ హయతి పాత్రకి అంత ప్రాధాన్యత లేదు. ప్రథమార్ధంలో ఇంటర్వెల్ కి ముందు వచ్చే పది నిముషాలు తప్ప మిగతాదంతా భరించటానికి ఎంతో ఓపిక కావాలి. దర్శకుడు సన్నివేశాలను చిత్రీకరించిన తీరు ఎంతో అమెచ్యూర్ గా ఉంది. విశాల్ నటించటమే కాదు, నిర్మాతగా కూడా ఎలా ఒప్పుకున్నాడన్నది అర్థం కాని విషయం. ఇక ద్వితీయార్థంలో చెల్లెలి మరణాన్ని ఎలా ఛేదించాడన్నది కొంత వరకూ ఆసక్తికరంగా అనిపించినా సాగదీతగా అనిపించక మానదు. డు ఆర్ డై సిట్యుయేషన్ లో విశాల్ చేయవలసిన సినిమా కాదు. ఇక కెరీర్ ఆరంభంలో ఎంతో యాక్టీవ్ గా ఉన్న విశాల్ రాను రాను ఎదో సినిమాలు చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్లుగా ఉంది. సినిమాలో ఒకే ఒక పాట ఉంది. శ్రీమణి రాసిన ఈ మాంటేజ్ సాంగ్ ‘మత్తెక్కించే కళ్ళే…’ పర్వాలేదనిపిస్తుంది. సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని మాత్రం చెప్పలేం. అయితే యువ‌న్ శంక‌ర్ రాజా నేపథ్య సంగీతం ఆయువు ప‌ట్టు అనే చెప్పాలి. `’రైజ్ ఆఫ్ ఏ కామన్ మేన్…’ థీమ్ మ్యూజిక్ బాగుంది. కెవిన్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. అయితే ‘ఒక నేర‌స్థుడు ఎలా పుడ‌తాడు? త‌న‌ను కాపాడేవాడు ఒక‌డున్నాడు అన్న ధీమా ఉన్నప్పుడే’, ‘ఎలుక‌ను త‌రిమే పాము ప్రమాద‌మైందా? పామును త‌రిమే ఎలుక ప్రమాద‌మైందా? పాముకున్న ఆక‌లి ఎలుక మాత్రమే. కానీ ఎలుక ఆక‌లి పొలం మొత్తం…’, ‘నేనొక సామాన్యుణ్ణి. ఎదురు తిర‌గ‌క పోతే న‌న్నూ చంపేస్తారు’ వంటి డైలాగ్స్ క‌థ‌కు త‌గ్గట్టుగా ఉన్నాయి. చాలా స‌న్నివేశాల చిత్రీకరణలో పాత‌ద‌న‌మే కొట్టొచ్చినట్లు క‌నిపిస్తుంది. ఏది ఏమైనా విశాల్ హిట్ కోసం మరో సినిమా దాకా వేచి చూడక తప్పదు.

ప్లస్ పాయింట్స్:

విశాల్ యాక్షన్ మూవీ కావ‌డం
కెవిన్ కెమేరా పనితనం

మైనస్ పాయింట్స్
ఆక్టటుకోని కథనం
తేలిపోయిన యోగిబాబు కామెడీ
సన్నివేశాల చిత్రీకరణలో సాగతీత

రేటింగ్: 2.25

ట్యాగ్ లైన్: అతి ‘సామాన్య’ చిత్రం!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Saamanyudu
  • Saamanyudu Movie Review
  • Saamanyudu Movie Review in Telugu
  • Saamanyudu Telugu Movie Review
  • Veeramae Vaagai Soodum

తాజావార్తలు

  • RCB vs SRH : ఆర్సీబీ రచ్చ..కోహ్లీ-పడిక్కల్ తుఫాన్‌తో హైదరాబాద్ చిత్తు

  • Off The Record : ఆ నేతలు మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారా..?

  • Iran Warning: భూతల దాడులు చేస్తే… అమెరికాకు అదే గతి.. ఇరాన్ పత్రిక వార్నింగ్

  • Viral Video: సీఎం బుగ్గపై ముద్దు పెట్టిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్..

  • Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions