The Paradise Review: ది పారడైజ్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Nani, Kayadu Lohar, Sampoornesh Babu, Mohan Babu, Raghav Juyal and others
- DIRECTOR: Srikanth Odela
- MUSIC: Anirudh Ravichander
- PRODUCER: Sudhakar Cherukuri
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది పారడైజ్’. కయాదు లోహర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, మోహన్ బాబు, సోనాలి కులకర్ణి వంటి టాలెంటెడ్ నటీనటులు ఎంతోమంది నటించారు. ప్రమోషనల్ స్టఫ్ అంతా బాగా వర్కౌట్ అయింది. దానికి తోడు ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ తీసుకున్న నిర్ణయం కూడా బాగా ప్రేక్షకులలోకి వెళ్ళింది. అయితే, ఈ సినిమా ఎట్టకేలకు 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
ది పారడైజ్ కథ:
సినిమా అంతా 80ల కాలంలో జరుగుతూ ఉంటుంది. సికింద్రాబాద్ దగ్గర ఉన్న పారడైజ్ ప్రాంతంలో ఒక గుర్తింపు కూడా లేని తెగ సవారీలు. ఆ తెగ గుర్తింపు కోసం పాటుపడుతున్న సమ్మక్క (సోనాలి కులకర్ణి) కొడుకే జడల్ (నాని). చిన్నప్పుడే ఒక సంఘటన వల్ల అతనికి తల్లి అంటే అసహ్యం కలుగుతుంది. దీంతో ఆమె చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వకుండా, ఆ పోరాటం చేయకుండా దొంగతనాలు చేసి వ్యవస్థకు ఎదురు వెళితే తప్ప గుర్తింపు దక్కదని భావిస్తూ ఉంటాడు. ఆ ప్రాంతం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని, కనీసం మనుషుల్లా కూడా సవారీలను ట్రీట్ చేయకుండా ఉన్న శిఖంజ మాలిక్ (మోహన్ బాబు) ఆధిపత్యాన్ని సమ్మక్క ప్రశ్నించగలిగిందా? అసలు సమ్మక్కను కొడుకు ఎందుకు అసహ్యించుకున్నాడు? తన కొడుకు చోటా మాలిక్‌ను తన వారసుడిగా ప్రకటించిన మాలిక్, ఆ ప్రాంతాన్ని అసలు ఎందుకు గుర్తింపు లేని ప్రాంతంగా మార్చేయాలనుకున్నాడు? చివరికి ఏం జరిగింది? అలాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ:
నాని ‘హిట్ 3’ సినిమాతోనే వైలెన్స్‌ని ఒక రేంజ్లో చూపించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఫ్యామిలీ హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి ఇమేజ్ సంపాదించుకున్న నాని, ఇమేజ్ మేకోవర్ కోసమో లేక భిన్నమైన సినిమాలు చేయాలనే ఉద్దేశంతోనో, కాస్త యాక్షన్ అలాగే వైలెన్స్ పాలు ఎక్కువగా ఉన్న సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగానే ‘ది పారడైజ్’ అనౌన్స్ చేసినప్పుడే మంచి బజ్ ఏర్పడింది. దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ అంతా రక్తపాతం చూసి, ఇది కూడా ఇంకేదో సృష్టించబోతోంది అని అందరూ ఫిక్స్ అయిపోయారు. సినిమాకి బజ్ కూడా అదే రేంజ్లో ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అలాగే జరిగాయి.
ఇక సినిమా ప్రారంభమైన కొద్దిసేపటి నుంచే ఇదేదో వేరే ప్రపంచంలోకి తీసుకువెళ్లే కథ అనే ఫీలింగ్ తీసుకొచ్చాడు దర్శకుడు. ఒక ప్రత్యేకమైన సెటప్, ఎక్కడా నార్మల్ అనే ఫీలింగ్ రాకుండా ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి ప్రేక్షకులందరినీ తీసుకువెళ్లిపోయాడు. అసలు ఆ ప్రదేశం ఏంటి, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, అక్కడ ప్రజల పరిస్థితులు, వారిపై పెత్తనం చేసేవారి ఆఘాయిత్యాలు అంటూ కొద్దిసేపట్లోనే సినిమా అవుట్‌లైన్ ఏంటో చూపించేశాడు. ఫస్టాఫ్ ఒకరకంగా గూస్బంప్స్ తెప్పించేలా సాగుతుంది. ఒకపక్క అనిరుధ్ మ్యూజిక్, మరొకపక్క శ్రీకాంత్ ఒదెల టేకింగ్‌తో పాటు, నాని పీక్ పెర్ఫార్మెన్స్తో ఇంటర్వెల్ బ్లాక్ వరకు సినిమా ఒక అద్భుతమైన ఫీల్ ఇస్తుంది.
ఇక సెకండ్ హాఫ్ మొదలయ్యాక, ఫస్టాఫ్‌లో ఇచ్చిన కిక్ నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. ఫస్టాఫ్ ‘బ్లాక్‌బస్టర్ లోడింగ్’ అనిపించగా, సెకండ్ హాఫ్‌లో ఆ ఫీలింగ్ నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. అయితే, నిజానికి సెకండ్ హాఫ్‌లో అంతకుమించి చూపించాల్సిన ఎలిమెంట్స్ ఏవీ దర్శకుడు రాసుకోలేదు. ఇవ్వాల్సిన హై అంతా ఫస్టాఫ్‌లోనే ఇచ్చేయడంతో, సెకండ్ హాఫ్‌లో కొంత ఎమోషనల్ మూమెంట్స్ వరకు వర్కౌట్ అయ్యాయి తప్ప మిగతాదంతా ఆర్టిఫిషియల్ ఫీలింగ్ కలిగిస్తాయి. ముఖ్యంగా తెలంగాణ నేత ఒకరిని ఇన్స్పిరేషన్గా చేసుకుని రాసుకున్న క్యారెక్టర్ చూసినప్పుడు ప్రేక్షకులలో మంచి ఫీల్ కలిగించేలా దర్శకుడు రాసుకున్నాడు.
అయితే, చాలాచోట్ల సెన్సార్ ఇచ్చిన కట్స్ కారణంగా సినిమా ఒక పజిల్లా ఫీల్ అవుతారు ప్రేక్షకులు. ఆ కట్స్ ప్రాంతంలో ఇంకేమైనా పదాలను యాడ్ చేసి ఉంటే కొంతవరకైనా రిలేట్ అయి ఉండేవారేమో. నాని సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో రక్తపాతంతో పాటు ఫౌల్ లాంగ్వేజ్ కూడా కాస్త ఎక్కువే. సెన్సార్ కట్స్ ఉన్నా, కొన్నిచోట్ల అక్కడేం మాట్లాడుతున్నారనే విషయం అర్థమవుతుంది. అయితే, సెకండ్ హాఫ్ విషయంలో కనుక దర్శకుడు ఇంకా కేర్ తీసుకుని, ఎమోషన్స్ ఇంకా వర్కౌట్ అయ్యేలా చేసి ఉంటే ఈ సినిమా రిజల్ట్ ఇంకా వేరేలా ఉండేది.
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమా నాని వన్ మ్యాన్ షో. మొత్తం సినిమాని తన భుజస్కంధాల మీద మోశాడు నాని. ఇప్పటివరకు హోమ్లీ క్యారెక్టర్స్‌లోనే అతన్ని చూసిన ఆడియన్స్, ఒక పూర్తిస్థాయి వైలెంట్ క్యారెక్టర్లో చూడటం కాస్త భిన్నంగానే అనిపించినా, నాని చాలా ఈజ్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఆయన చేసిన ఫైట్లు, డ్యాన్సులు బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక కయాదు లోహర్ పాత్ర పరిమితమే అయినా, కీలకం కావడంతో ఉన్నంతలో ఆకట్టుకుంది. ఇక బిర్యానీ అనే పాత్రలో సంపూర్ణేష్ బాబు పూర్తిస్థాయి సీరియస్ పాత్రలో ఆకట్టుకున్నాడు. మోహన్ బాబు పాత్ర స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా, కనిపించిన ప్రతిసారీ తనదైన డామినేషన్ కనబరిచాడు. రాఘవ జుయాల్పాత్ర చిన్నదే అయినా డిజైన్ చేసిన తీరు బావుంది; ఇంకా వాడుకుంటే బావుండు అనే ఫీల్ కలిగిస్తుంది.
ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, ఈ సినిమాకి ఆర్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడా కామన్ లొకేషన్స్‌లో చేయకుండా ప్రతి సీన్ కూడా సెట్లోనే చేయాల్సి రావడం ఛాలెంజింగ్ టాస్క్. ఆ విషయంలో ఆర్ట్ టీమ్ బాగానే కష్టపడింది. దర్శకుడు శ్రీకాంత్ ఒదెల చెప్పాలనుకున్న కథ చాలా రా అండ్ రస్టిక్‌గానే ఉన్నా, దాన్ని మరింత ఎమోషనల్‌గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ఉన్న ఇంపాక్ట్ సెకండ్ హాఫ్‌లో కూడా క్యారీ చేయడంలో దర్శకుడు కాస్త తడబడిన ఫీలింగ్ కలిగింది. ఇక కొన్ని డైలాగ్స్ బానే ఉన్నా, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆ డైలాగ్స్‌ను సైతం డామినేట్ చేసేలా ఉండటం గమనార్హం. ఎలివేషన్ సీన్స్ విషయంలో అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా వర్కౌట్ అయింది, కానీ కొన్నిచోట్ల డైలాగ్‌లను సైతం ఓవర్‌రైట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇక ఫైట్స్ కూడా చాలా భిన్నంగా, భయం కలిగించేలా డిజైన్ చేశారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి పెట్టిన ఖర్చు స్క్రీన్ మీద కనిపిస్తోంది.
ఇక ఫైనల్‌గా, ‘ది పారడైజ్’ బిర్యానీ బాగుంది.. కానీ!
తాజావార్తలు
-
CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Schools Holiday: భారీ వర్షాలతో అతలాకుతలం.. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
-
Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!