Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema Reviews Bro Daddy Movie Review In Telugu

రివ్యూ: బ్రో డాడీ (మలయాళం) డిస్నీ ప్లస్ హాట్ స్టార్

Published Date :January 27, 2022 , 8:33 am
By Prakash
రివ్యూ: బ్రో డాడీ (మలయాళం) డిస్నీ ప్లస్ హాట్ స్టార్
  • Follow Us :
  • google news
  • dailyhunt

మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తొలిసారి ‘లూసిఫర్’ మూవీ కోసం మెగా ఫోన్ పట్టుకున్నాడు. మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించిన ‘లూసిఫర్’ మలయాళంలో ఘన విజయం సాధించింది. అంతేకాదు… ఇప్పుడు అదే సినిమాను చిరంజీవి తెలుగులో ‘గాడ్ ఫాదర్‌’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. విశేషం ఏమంటే… ‘లూసిఫర్’ లాంటి పొలిటికల్ థ్రిల్లర్ ను తెరకెక్కించిన పృథ్వీరాజ్ మలియత్నంలో మాత్రం కామెడీ డ్రామాను ఎంచుకున్నాడు. ‘బ్రో డాడీ’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ సినిమాలోనూ మోహన్ లాలే కీలక పాత్ర పోషించడం విశేషం. కేవలం నలభై నాలుగు రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ‘బ్రో డాడీ’ మూవీ జనవరి 26 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

అన్నమ్మ (మీనా), జాన్ కట్టాడి (మోహన్ లాల్) భార్యాభర్తలు. వాళ్ళ అబ్బాయి యేషూ (పృధ్వీరాజ్ సుకుమారన్) బెంగళూర్ లో ఉంటూ అడ్వర్టైజింగ్ రంగంలో పనిచేస్తుంటాడు. జాన్ స్నేహితుడు కురియన్ (లాలు అలెక్స్), అతని భార్య ఎల్సీ (కనిహా)లకు అన్నా (కళ్యాణీ ప్రియదర్శన్) అనే కూతురుంటుంది. యేషూకు, అన్నాను ఇచ్చి పెళ్ళి చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఈ రెండు కుటుంబాలకు వస్తుంది. అయితే అడ్వర్టైజింగ్ రంగంలో ఉండే వ్యక్తిని తాను పెళ్ళి చేసుకోనని, తనూ అదే రంగంలో ఉన్నాను కాబట్టి ప్రొఫెషనల్ సీక్రెట్స్ మెయిన్ టైన్ చేయడం కష్టమని అన్నా తన తండ్రికి చెబుతుంది. చిత్రం ఏమంటే… అప్పటికే నాలుగేళ్ళుగా యేషూ, అన్నా బెంగళూరులో తమ పెద్దలకు తెలియకుండా సహజీవనం చేస్తుంటారు. ఓ మంచి రోజు చూసి ఇంట్లో వాళ్ళకు చెప్పి పెళ్ళి చేసుకుందామని అనుకునేంతలో అన్నా యాక్సిడెంటల్ గా ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ ఊహించని సంఘటనతో కంగుతింటాడు యేషూ. ఇదే సమయంలో అర్జంట్ గా ఊరికి రమ్మని తండ్రి నుండి ఫోన్ వస్తుంది. రాత్రికి రాత్రి బయలు దేరి ఊరెళ్ళిన యేషూ కు మరో షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేమింటంటే అతని తల్లి అన్నమ్మకు లేట్ ప్రెగ్నెన్సీ వస్తుంది. కాస్తంత సిగ్గుపడుతూ జాన్, అన్నమ్మ ఈ విషయాన్ని కొడుక్కి చెబుతారు. మరి యేషూ తన ఘనకార్యాన్ని తల్లిదండ్రులకు ఎలా చెప్పాడు? వాళ్ల రియాక్షన్ ఏమిటీ? ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచిపెట్టి యేషూ, అన్నా వివాహం జరిపించాలని అనుకున్న వారి ప్లాన్ సక్సెస్ అయ్యిందా? లేదా? అనేది మిగతా కథ.

సినిమా ప్రారంభమే చిన్నపాటి ట్విస్ట్ తో మొదలైవుతుంది. బెంగళూరులో ఉద్యోగాలు చేస్తూ ఒకరికి ఒకరితో ఏ సంబంధం లేదని బుకాయించే యేషూ, అన్నా సహజీవనం ప్రేక్షకులఊహకు అందని అంశం. ఇదిలా ఉంటే… ఇటు అన్నా యాక్సిడెంటల్ గా, అటు అన్నమ్మా లేట్ గా ప్రెగ్నెంట్ కావడం చూసేవారిని ఓ కుదుపు కుదుపుతుంది. అయితే ఆడవాళ్ళు ఈ విషయాన్ని సహజంగా తీసుకున్నా మిగిలిన వారు ఏమనుకుంటారో అని మగవాళ్ళు టెన్షన్ పడటమే అసలు వినోదం. ప్రథమార్థం అంతా సరదాగా సాగిపోయినా… ద్వితీయార్థంకు వచ్చే సరికీ కథ ముందుకు సాగదు. ప్రాణ స్నేహితుడైన కురియన్ ను అంతా కలిసి మోసం చేస్తున్నారనే భావన కలుగుతుంది. సరిగ్గా అక్కడే కథను దర్శకుడు సుకుమారన్ తేల్చేశాడు. చివరి అరగంటలో కురియన్ ఎపిసోడ్ కు హర్రీబర్రీగా ముగింపు పలికేశాడు. దాంతో అప్పటి వరకూ వినోద ప్రధానంగా సాగిన ‘బ్రో డాడీ’ చివరికి వచ్చే సరికీ తేలిపోయింది. పైగా తండ్రీ కూతుళ్ళ మధ్య ఎమోషన్స్ ను సరిగా కాప్చర్ చేయలేకపోయాడు. దాంతో ఎంటర్ టైన్ మెంట్ తో పాటు చక్కని సెంటిమెంట్ కూ ప్రాధాన్యమున్న ఈ కథ తేలిపోయింది. సినిమా ప్రారంభంలోని కొన్ని సీన్స్ ఆ మధ్య వచ్చిన హిందీ సినిమా ‘బధాయ్ హో’ను జ్ఞప్తికి తెస్తాయి. కానీ ఆ తర్వాత కథ వేరే రకంగా టర్నింగ్ ఇచ్చుకోవడంతో ఆ మూడ్ లోంచి బయటకు వచ్చేస్తాం.

నటీనటులంతా ఆ యా పాత్రల్లో చక్కగా ఇమిడిపోయారు. మరీ ముఖ్యంగా మోహన్ లాల్ చాలా ఈజ్ తో తన పాత్రను పోషించాడు. అంతేకాదు… ఎంజాయ్ చేస్తూ నటించాడు. మీనా, మోహన్ లాల్ ఇటీవల వచ్చిన ‘దృశ్యం -2’లో కూడా కలిసి నటించడంతో ఆ జంటను జనం బాగానే ఓన్ చేసుకుంటారు. మీనా కూడా చక్కగా నటించింది. కళ్యాణీ ప్రియదర్శన్ కూడా తన వంతు కృషి తాను బాగానే చేసింది. మోహన్ లాల్, పృధ్వీరాజ్ తండ్రీకొడుకులుగా బాగున్నారు. సహజ నటన ప్రదర్శించారు. పృథ్వీరాజ్ దర్శకుడిగా అదనపు బాధ్యతలు తీసుకున్నా, అదెక్కడా నటన మీద ప్రతిఫలించలేదు. లాలు అలెక్స్, అతని భార్యగా కనిహా, మోహన్ లాల్ తల్లిగా పృథ్వీరాజ్ తల్లి మల్లికా సుకుమారన్, డాక్టర్ గా జగదీశ్, మరో ప్రధాన పాత్రలో ఉన్ని ముకుందన్ నటించారు. ద్వితీయార్థంలో వెడ్డింగ్ ఈవెంట్ మేనేజర్ హ్యాపీ పాత్రలో సౌబిన్ సాహిర్ కనిపించింది కొద్దిసేపే అయినా బాగానే కామెడీ పండించాడు. శ్రీజిత్, బిబిన్ ఈ కథను అందించగా, దీపక్ దేవ్ సంగీతాన్ని సమకూర్చాడు. లిమిటెడ్ బడ్జెట్ తో, సింపుల్ గా మూవీని బాగానే తీశారు. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడమే బెటర్. ఆ స్పృహతోనే కావచ్చు… డిస్నీ హాట్ స్టార్ కు ప్రసార హక్కుల్ని ఇచ్చేశారు. భారీ అంచనాలు పెట్టుకోకుండా… సరదాగా టైమ్ పాస్ కోసం ‘బ్రో డాడీ’ని ఓసారి చూసేయొచ్చు.

ప్లస్ పాయింట్స్
మోహన్ లాల్, మీనా నటన
వినోదానికి పెద్ద పీట వేయడం
పృథ్వీరాజ్ దర్శకుడు కావడం

మైనెస్ పాయింట్స్
తేలిపోయిన ద్వితీయార్థం
ఊహకందే క్లయిమాక్స్

రేటింగ్: 2.5/ 5

ట్యాగ్ లైన్: యాక్సిడెంటల్ కామెడీ!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bro Daddy Malayala Movie Review
  • Bro Daddy Movie Review
  • Bro Daddy Movie Review in Telugu
  • Kalyani Priyadarshan
  • Meena

తాజావార్తలు

  • Middle East Crisis : మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్.. పాన్ ఇండియా సినిమాలపై తీవ్ర ప్రభావం

  • Raja Shivaji Anthem: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘రాజా శివాజీ’ ఫస్ట్ సాంగ్!

  • Srinivasa Mangapuram: జయకృష్ణ ఎంట్రీ అదుర్స్.. మహేష్ బాబు రిలీజ్ చేసిన ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్!

  • Lok sabha: నేటి నుంచి 3 రోజులు ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై చర్చ

  • Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు అప్పులు తీర్చేస్తారు!

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions