బాలమిత్ర’ – రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్రం పేరు: ‘బాలమిత్ర’
విడుదల తేది: 2021, ఫిబ్రవరి 26
నటీనటులు: రంగ, శశికళ, కియారెడ్డి, అనూష, దయానంద రెడ్డి, మీసాల లక్ష్మణ్ తదితరులు
సంగీతం: జయవర్ధన్,
సినిమాటోగ్రఫీ: రజిని,
ఎడిటర్: రవితేజ,
ఆర్ట్: భీమేష్,
నిర్మాతలు: శైలేష్ తివారి, బొద్దుల లక్ష్మణ్,
కథ, దర్శకత్వం: శైలేష్ తివారి.
లాక్డౌన్ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీ వరుస హిట్లతో జోష్ మీదుంది. ఇదే క్రమంలో తాజాగా విడుదలైన మూవీ ‘బాలమిత్ర’. టైటిల్ చూస్తే.. చిన్నప్పటి చందమామ కథలు గుర్తుకు వచ్చేలా ఉన్నా ఇదొక ఆసక్తికరమైన కథతో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్. ఈ జానర్ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనొచ్చు. చిత్రయూనిట్ కూడా సినిమా అద్భుతంగా ఉంటుందని చెబుతూ వచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? టాలీవుడ్‌కు మరో హిట్ పడినట్టేనా? ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.
స్టోరీ:
Also Read
మెడికల్ స్టూడెంట్ అయిన అర్జున్ (రంగా), తన క్లాస్మేట్ దీక్ష (కియా)ని ప్రేమిస్తాడు. ముందు ప్రేమని అంగీకరించకపోయినా.. అతని ప్రేమ నిజం అని తెలుసుకున్న దీక్ష.. అతనని ప్రేమిస్తుంది. అయితే అనూహ్యంగా దీక్ష కిడ్నాప్ అవుతుంది. కిడ్నాపర్లు అర్జున్‌కి ఫోన్ చేసి.. ముగ్గురిని చంపితేనే దీక్షని వదులుతామని బెదిరిస్తారు. వారు చెప్పినట్లే ఇద్దరిని చంపేసిన అర్జున్.. కొన్ని రోజులు కనిపించకుండా ఉండేందుకు బాల స్నేహితుడిగా ఓ గ్రామం వెళతాడు. అక్కడ బాల సోదరి వైశాలి.. అర్జున్‌ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అసలు దీక్ష కిడ్నాప్ ఎందుకు అవుతుంది? బాల ఎవరు? వైశాలి ఫ్యామిలీకి అర్జున్ చేసే హత్యలకు సంబంధం ఏమిటి? వంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే.. సస్పెన్స్‌తో నిండిన ‘బాలమిత్ర’ చిత్రం చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
హీరో అర్జున్ చూపులకు చాలా చక్కగా ఉన్నాడు. హీరో క్వాలిటీస్ అతనిలో బాగున్నాయి. కొన్ని సీన్లలో చాలా చక్కగా నటించాడు. అతనికిది రెండో చిత్రమే అయినా.. ఎక్కడా అలాంటి ఫీలింగ్ రానివ్వకుండా మెప్పించాడు. లవర్‌గానూ, అలాగే తనకి తెలియకుండా చేస్తున్న హత్యలకు కారణం ఏమిటో తెలుసుకునే అన్వేషిగా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ని కనబరిచాడు. హీరోయిన్లలో కియా రెడ్డి గ్లామర్‌గా కాసేపు కనిపించింది. అలాగే కథలో మెయిన్ పాత్రధారిగా కూడా ఆమె నటన బాగుంది. బాల త్రిపుర సుందని పాత్రలో చేసిన అమ్మాయి క్యూట్‌గా సమాజం కోసం తాపత్రయపడే పాత్రలో ఒదిగిపోయింది. చిత్రానికి మెయిన్ ట్విస్ట్ ఇచ్చే వైశాలి పాత్ర చిత్రీకరణ చాలా బాగుంది. అలాగే వైశాలిగా చేసిన అమ్మాయి పల్లెటూరి అమ్మాయిగా, పగబట్టిన నారిగా రెండు పాత్రలను అద్భుతంగా పోషించింది. మిగతా పాత్రల్లో హీరో ఫ్రెండ్స్ నవ్వించే ప్రయత్నం చేయగా.. తండ్రి పాత్రలో దయానందరెడ్డి చక్కటి నటనను కనబరిచారు. మిగతా పాత్రలన్నీ కథకు అనుగుణంగా నడిచాయి.
టెక్నికల్ విభాగం:
మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా రెండు పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సంగీత దర్శకుడు మెప్పించాడు. వెళ్లిపోమాకే, తండ్రీ కూతుళ్ల బంధం తెలిపే సాంగ్ బాగున్నాయి. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ ఓకే. సినిమా నిర్మాణం కూడా చాలా రిచ్‌గా ఉంది. కథను నమ్మి నిర్మాత ఖర్చు పెట్టినట్లు అనిపిస్తుంది. ఇక దర్శకత్వం గురించి చెప్పాలంటే.. ఫస్టాఫ్ సోసో గా నడిపించినా.. సెకండాఫ్ మాత్రం ట్విస్ట్‌లతో దర్శకుడు చిత్రాన్ని ఆసక్తికరంగా మలిచాడు. సరైన క్లైమాక్స్‌తో చిత్రాన్ని ముగించాడు.
విశ్లేషణ:
సినిమా స్టార్టింగే.. దిశ ఘటన తరహా ఘటనతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత స్కూల్ పిల్లలతో కార్టూన్స్ స్టోరీ నడుస్తుండగా.. టైటిల్స్ పడుతుంటాయి. ఆ కార్టూన్స్ ప్లేని కరెక్ట్‌గా ఫాలో అయితే సినిమా స్టోరీ మొత్తం రివీలవుతుంది. దర్శకుడు తను చెప్పాలనుకున్న కథకి, సస్పెన్స్ జోడించి థ్రిల్లర్‌గా మార్చాడు. ఫస్టాఫ్ అంతా హీరో, హీరోయిన్ల ప్రేమని హైలెట్ చేసి, సెకండాఫ్‌లో మెయిన్ కథని నడిపించాడు. ఎందుకు చంపుతున్నాడో తెలియని హీరోకి.. ఆ కారణం తెలియజేసే ట్విస్ట్ బాగుంది. అలాగే ‘అతడు’ తరహాలో హత్యలు చేసిన హీరో కొన్ని రోజులు కనిపించకుండా ఉండడానికి ఆ హత్యలకు కారణమైన ఫ్యామిలీ ఇంటిలోనే బస చేయడం కూడా స్క్రీన్‌ప్లే హైలెట్‌గా చెప్పుకోవచ్చు. అలాగే ప్రతీ పాత్రకి, ఆఖరి చిన్న బుడతడి పాత్రతో కూడా దర్శకుడు కామెడీ చేయించాడు. మనిషికి ఆశయమే కాదు.. దానికి తగిన ఆలోచన కూడా ఉండాలని, అది ఉన్నతంగా ఉండాలని దర్శకుడు చెప్పిన తీరు.. ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఫస్టాఫ్ ఇదేం సినిమా అనుకున్న ప్రేక్షకుడు కూడా.. సెకండాప్‌కి వచ్చేసరికి తృప్తిగా బయటికి వస్తాడు. ఓవరాల్‌గా దర్శకుడు చెప్పాలనుకున్న మెయిన్ విషయం ఆడియన్‌కి బాగా కనెక్ట్ అవుతుంది.
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!