Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema Reviews Balamitra Movie Review Rating

బాలమిత్ర’ – రివ్యూ

Published Date :March 3, 2021 , 1:52 pm
By newsdesk
బాలమిత్ర’ – రివ్యూ
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

చిత్రం పేరు‌: ‘బాలమిత్ర’
విడుదల తేది: 2021, ఫిబ్రవరి 26
నటీనటులు: రంగ, శశికళ, కియారెడ్డి, అనూష, దయానంద రెడ్డి, మీసాల లక్ష్మణ్ తదితరులు
సంగీతం: జయవర్ధన్,
సినిమాటోగ్రఫీ: రజిని,
ఎడిటర్: రవితేజ,
ఆర్ట్: భీమేష్,
నిర్మాతలు: శైలేష్ తివారి, బొద్దుల లక్ష్మణ్,
కథ, దర్శకత్వం: శైలేష్ తివారి.

లాక్‌డౌన్ త‌ర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీ వ‌రుస హిట్ల‌తో జోష్ మీదుంది. ఇదే క్ర‌మంలో తాజాగా విడుద‌లైన మూవీ ‘బాలమిత్ర’‌‌. టైటిల్‌ చూస్తే.. చిన్నప్పటి చందమామ కథలు గుర్తుకు వచ్చేలా ఉన్నా ఇదొక ఆసక్తికరమైన కథతో తెరకెక్కిన‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌. ఈ జాన‌ర్ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనొచ్చు. చిత్రయూనిట్ కూడా సినిమా అద్భుతంగా ఉంటుంద‌ని చెబుతూ వ‌చ్చారు. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? టాలీవుడ్‌కు మ‌రో హిట్ ప‌డిన‌ట్టేనా? ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.
 
స్టోరీ:

Also Read

  • Sathi Leelavathi Movie Review : లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' మూవీ రివ్యూ
  • Razor Movie Review : రేజర్ మూవీ రివ్యూ
  • M4M Movie Review : 'ఎం4ఎం' రివ్యూ
  • Godari Gattupaina Movie Review : గోదారి గట్టుపైన మూవీ రివ్యూ
Add as a preferred
source on google

మెడికల్‌ స్టూడెంట్‌ అయిన అర్జున్‌ (రంగా), తన క్లాస్‌మేట్‌ దీక్ష (కియా)ని ప్రేమిస్తాడు. ముందు ప్రేమని అంగీకరించకపోయినా.. అతని ప్రేమ నిజం అని తెలుసుకున్న దీక్ష.. అతనని ప్రేమిస్తుంది. అయితే అనూహ్యంగా దీక్ష కిడ్నాప్‌ అవుతుంది. కిడ్నాపర్లు అర్జున్‌కి ఫోన్‌ చేసి.. ముగ్గురిని చంపితేనే దీక్షని వదులుతామని బెదిరిస్తారు. వారు చెప్పినట్లే ఇద్దరిని చంపేసిన అర్జున్‌.. కొన్ని రోజులు కనిపించకుండా ఉండేందుకు బాల స్నేహితుడిగా ఓ గ్రామం వెళతాడు. అక్కడ బాల సోదరి వైశాలి.. అర్జున్‌ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అసలు దీక్ష కిడ్నాప్‌ ఎందుకు అవుతుంది? బాల ఎవరు? వైశాలి ఫ్యామిలీకి అర్జున్‌ చేసే హత్యలకు సంబంధం ఏమిటి? వంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే.. సస్పెన్స్‌తో నిండిన ‘బాలమిత్ర’ చిత్రం చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:

హీరో అర్జున్‌ చూపులకు చాలా చక్కగా ఉన్నాడు. హీరో క్వాలిటీస్‌ అతనిలో బాగున్నాయి. కొన్ని సీన్లలో చాలా చక్కగా నటించాడు. అతనికిది రెండో చిత్రమే అయినా.. ఎక్కడా అలాంటి ఫీలింగ్‌ రానివ్వకుండా మెప్పించాడు. లవర్‌గానూ, అలాగే తనకి తెలియకుండా చేస్తున్న హత్యలకు కారణం ఏమిటో తెలుసుకునే అన్వేషిగా సెటిల్డ్‌ పెర్ఫార్మెన్స్‌ని కనబరిచాడు. హీరోయిన్లలో కియా రెడ్డి గ్లామర్‌గా కాసేపు కనిపించింది. అలాగే కథలో మెయిన్‌ పాత్రధారిగా కూడా ఆమె నటన బాగుంది. బాల త్రిపుర సుందని పాత్రలో చేసిన అమ్మాయి క్యూట్‌గా సమాజం కోసం తాపత్రయపడే పాత్రలో ఒదిగిపోయింది. చిత్రానికి మెయిన్‌ ట్విస్ట్ ఇచ్చే వైశాలి పాత్ర చిత్రీకరణ చాలా బాగుంది. అలాగే వైశాలిగా చేసిన అమ్మాయి పల్లెటూరి అమ్మాయిగా, పగబట్టిన నారిగా రెండు పాత్రలను అద్భుతంగా పోషించింది. మిగతా పాత్రల్లో హీరో ఫ్రెండ్స్‌ నవ్వించే ప్రయత్నం చేయగా.. తండ్రి పాత్రలో దయానందరెడ్డి చక్కటి నటనను కనబరిచారు. మిగతా పాత్రలన్నీ కథకు అనుగుణంగా నడిచాయి.

టెక్నిక‌ల్ విభాగం:

మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా రెండు పాటలు, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌తో సంగీత దర్శకుడు మెప్పించాడు. వెళ్లిపోమాకే, తండ్రీ కూతుళ్ల బంధం తెలిపే సాంగ్‌ బాగున్నాయి. ఎడిటింగ్‌, ఆర్ట్ వర్క్‌ ఓకే. సినిమా నిర్మాణం కూడా చాలా రిచ్‌గా ఉంది. కథను నమ్మి నిర్మాత ఖర్చు పెట్టినట్లు అనిపిస్తుంది. ఇక దర్శకత్వం గురించి చెప్పాలంటే.. ఫస్టాఫ్‌ సోసో గా నడిపించినా.. సెకండాఫ్‌ మాత్రం ట్విస్ట్‌లతో దర్శకుడు చిత్రాన్ని ఆసక్తికరంగా మలిచాడు. సరైన క్లైమాక్స్‌తో చిత్రాన్ని ముగించాడు. 

విశ్లేషణ:

సినిమా స్టార్టింగే.. దిశ ఘటన తరహా ఘటనతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత స్కూల్‌ పిల్లలతో కార్టూన్స్‌ స్టోరీ నడుస్తుండగా.. టైటిల్స్‌ పడుతుంటాయి. ఆ కార్టూన్స్‌ ప్లేని కరెక్ట్‌గా ఫాలో అయితే సినిమా స్టోరీ మొత్తం రివీలవుతుంది. దర్శకుడు తను చెప్పాలనుకున్న కథకి, సస్పెన్స్‌ జోడించి థ్రిల్లర్‌గా మార్చాడు. ఫస్టాఫ్‌ అంతా హీరో, హీరోయిన్‌ల ప్రేమని హైలెట్‌ చేసి, సెకండాఫ్‌లో మెయిన్‌ కథని నడిపించాడు. ఎందుకు చంపుతున్నాడో తెలియని హీరోకి.. ఆ కారణం తెలియజేసే ట్విస్ట్‌ బాగుంది. అలాగే ‘అతడు’ తరహాలో హత్యలు చేసిన హీరో కొన్ని రోజులు కనిపించకుండా ఉండడానికి ఆ హత్యలకు కారణమైన ఫ్యామిలీ ఇంటిలోనే బస చేయడం కూడా స్క్రీన్‌ప్లే హైలెట్‌గా చెప్పుకోవచ్చు. అలాగే ప్రతీ పాత్రకి, ఆఖరి చిన్న బుడతడి పాత్రతో కూడా దర్శకుడు కామెడీ చేయించాడు. మనిషికి ఆశయమే కాదు.. దానికి తగిన ఆలోచన కూడా ఉండాలని, అది ఉన్నతంగా ఉండాలని దర్శకుడు చెప్పిన తీరు.. ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఫస్టాఫ్‌ ఇదేం సినిమా అనుకున్న ప్రేక్షకుడు కూడా.. సెకండాప్‌కి వచ్చేసరికి తృప్తిగా బయటికి వస్తాడు.  ఓవరాల్‌గా దర్శకుడు చెప్పాలనుకున్న మెయిన్‌ విషయం ఆడియన్‌కి బాగా కనెక్ట్ అవుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • balamitra
  • balamitra review
  • ranga
  • shailesh tiwari
  • Tollywood

తాజావార్తలు

  • Mothers Day Special: మాతృత్వానికి ప్రణామం.. సృష్టికి ప్రతిరూపం.. సహనానికి నిలువుటద్దం “అమ్మ”

  • GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్‌కు..!

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!

  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions