Facebook Love: ప్రేమకు హద్దులు లేవు. మనసుకు సరిహద్దులు తెలియవు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తిని పెళ్లాడింది… స్వీడన్‌కు చెందిన ఒక మహిళ. ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాకు చెందిన పవన్ కుమార్‌కు స్వీడన్‌కు చెందిన క్రిస్టేన్ లైబర్ట్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఇది వారిద్దరి మధ్య 2012నుంచి కొనసాగిన పరిచయం ప్రేమకు దారి తీసింది. పదేళ్లుగా మొబైల్ ఫోన్‌లో చాటింగ్, వీడియో కాల్స్ ద్వారా ప్రేమాయణం సాగించారు. గతేడాది ఆగ్రాలోని తాజ్‌మహల్ వద్ద వారిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఆ సందర్భంలోనే పెళ్లితో ఒక్కటి అవ్వాలని నిర్ణయించుకున్నారు.
Read Also: RTC Bus Accident: శ్రీశైలంలో లోయలో పడబోయిన తెలంగాణ ఆర్టీసీ బస్సు
ఈ క్రమంలోనే క్రిస్టేన్ స్వీడన్ నుంచి భారత్‌కు వచ్చింది. శుక్రవారం ఉత్తరప్రదేశ్ అవగఢ్‌లోని ఒక స్కూల్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం పవన్ కుమార్ ను ఆమె పెళ్లాడింది. భారత్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఈ దేశానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని క్రిస్టేన్ తెలిపింది. మరోవైపు తమ కుమారుడికి విదేశీ మహిళతో పెళ్లి జరుగడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వరుడు పవన్ కుమార్ తండ్రి గీతమ్ సింగ్ తెలిపారు. డెహ్రాడూన్‌లో బీటెక్ చేసిన పవన్ కుమార్ ఒక సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. స్వీడన్ మహిళతో అతడి పెళ్లి వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Also: Boat capsize : విహారంలో విషాదం.. బోటు బోల్తాపడి పదిమంది చిన్నారుల మృతి