Zomato Scam: జొమాటో ‘డెలివరీ స్కామ్’.. సీఈఓకు తెలిసి కూడా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో దేశంలో నెంబర్ వన్‌గా దూసుకెళ్తోంది. కస్టమర్ల అభిమానాన్ని చూరగొన్న ఈ యాప్ అనతి కాలంలోనే సక్సెస్‌ఫుల్ స్టార్టప్‌గా పేరు తెచ్చుకుంది. అయితే ఈ జొమాటో ఫుడ్ డెలివరీకి సంబంధించిన ఓ స్కామ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్‌కు తెలిసే ఇదంతా జరుగుతుండటం చూసి కస్టమర్లు నివ్వెరపోతున్నారు. అదేంటంటే.. మీరు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టే ఉంటారు. మరి ఆర్డర్ చేసిన ఫుడ్‌కు ఆన్‌లైన్‌లో పేమెంట్ చేస్తున్నారా? లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటున్నారా?. ఎక్కువ ఆన్‌లైన్ పేమెంట్ చేసుంటారు కదా. ఇకపై మాత్రం ఆన్‌లైన్ పేమెంట్ చేయకండి. క్యాష్ ఆన్ డెలివరీ పద్దతిలోనే డబ్బులు చెల్లించండి. ఫుడ్ డెలివరీ సంస్థల్ని మోసం చేసి వందల రూపాయిల్ని మీరు కూడా ఆదా చేసుకోండి. ఇదంతా ఏంటని అనుకుంటున్నారా? ఏం లేదండి. పూర్తిగా చదవండి మీకే అర్థం అవుతుంది.
Apple Company: iPhone లేటెస్ట్ మోడల్స్‌కి కేరాఫ్‌గా మారనున్న ఇండియా
Also Read
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
- Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఉత్తరాఖండ్‌కు చెందిన ఎంట్రప్రెన్యూర్ వినయ్ సతి కొద్దిరోజుల క్రితం జొమాటోలో బర్గర్స్ ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ పెట్టిన 30 నిమిషాల తర్వాత బర్గర్స్ తెచ్చిన ఆ డెలివరీ బాయ్.. వినయ్‌తో.. “సార్ నెక్ట్స్ టైం నుంచి మీరు ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయకండి. క్యాష్ ఆన్ డెలివరీ చేయండి. మీరు 700-800 రూపాయిలు విలువ చేసే ఫుడ్ ఆర్డర్ పెట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోండి. కానీ మీరు నాకు 200 రూ. మాత్రమే చెల్లించండి. మీరు ఆర్డర్‌ను తీసుకోలేదని నేను జొమాటో వాళ్లతో చెబుతా. కానీ మీరు మీ ఫుడ్ ఎంజాయ్ చేయండి. 200-300రూ. కట్టి 1000రూ. ఫుడ్ తినండి..” అంటూ చెప్పాడు. అది విని ఖంగుతున్న వినయ్.. ఈ ఉదంతాన్ని లింక్‌డిన్‌లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌లో…జొమాటోలోని డెలివరీ బాయ్స్ భారీగా మోసం చేస్తున్నారని, ఎలా మోసం చేయాలో సలహా ఇచ్చారని, జొమాటోలో స్కామ్ జరుగుతోందని విని నాకు గూస్‌బంప్స్ వచ్చాయని పేర్కొన్నారు. ఇక, జొమాటో డెలివరీ బాయ్ చెప్పినట్లు ఆఫర్‌ను ఎంజాయ్ చేయాలా? లేదంటే మోసాన్ని బహిర్గతం చేయాలా? అని ప్రశ్నించారు.నేను ఎంట్రప్రెన్యూర్‌ను కాబట్టి సెకండ్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకున్నానని.. అందుకే మీ ముందుకు వచ్చానంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది. కాగా.. ఆ పోస్ట్‌పై జొమాటో సీఈవో గోయల్ స్పందించారు. కంపెనీలో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సరిచేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపారు. అంటే ఇదంతా సీఈఓ లాంటి పై అధికారులకు తెలిసే జరుగుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!