టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత మన మనసుకు తగినట్టుగా రంగు రంగుల దుస్తులు వేసుకుంటున్నాం. అన్ని వస్తువులు కావాల్సిన రంగుల్లో దొరుకున్నాయి. తెచ్చుకున్న రంగు మనసుకు నచ్చకపోతే కావాల్సిన రంగుగా మార్చుకుంటాం. అదే ఖరీదైన కారును కొనుగోలు చేసిన తరువాత ఆ రంగు నచ్చకుంటే మార్చుకోవాలి అంటే చాలా ఇబ్బంది. మన మనసుకు తగ్గట్టుగా రెండు మూడు రంగుల్లోకి కారు మారిపోతే ఎలా ఉంటుంది. ఆలోచన బాగుంది. మరి అలాంటి కార్లు నిజంగా విపణిలోకి వస్తాయా అంటే… ఇదుగో తీసుకోచ్చేశాం అంటోంది బీఎండబ్ల్యూ సంస్థ.
Read: షెడ్యూల్ ప్రకారమే యూపీఎస్సీ మెయిన్స్…
బీఎండబ్ల్యూ సంస్థ ఐఎక్స్ ఫ్లో అనే కారును తీసుకొచ్చింది. ఈ కారును లాస్ వేగాస్‌లో జరుగుతున్న సీఈఎస్ 2022లో ప్రదర్శించింది. ఈ కారు నలుపు నుంచి తెలుపు, తెలపు నుంచి నలుగు, నలుపు తెలుపు మిక్సింగ్ ఇంకా కొన్ని రంగుల్లోకి మారుతుంది. ఐ ఇంక్ టెక్నాలజీ సమన్వయంలో బీఎండబ్ల్యూ ఈ కారును తయారు చేసింది. కారుకు సంబంధించిన వీడియోను రీలీజ్ చేశారు. అయితే, ఈ కారు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది అనే, ఫీచర్లు ఏంటి అనే విషయాలను వెల్లడించలేదు.