షెడ్యూల్ ప్ర‌కార‌మే యూపీఎస్సీ మెయిన్స్‌…

గ‌తేడాది అక్టోబ‌ర్ నెల‌లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.  జూన్ నెల‌లో జర‌గాల్సిన ప‌రీక్ష‌ల‌ను క‌రోనా కార‌ణంగా అక్టోబ‌ర్‌కు వాయిదా వేశారు.  అక్టోబ‌ర్‌లో ప‌రీక్ష‌ల‌ను యూపీఎస్సీ విజ‌య‌వంతంగా నిర్వ‌హించింది.  అక్టోబ‌ర్ చివ‌రి వ‌ర‌కు రిజల్ట్‌ను ప్ర‌క‌టించింది.  కాగా, మెయిన్స్ జ‌నవ‌రిలో జ‌ర‌గాల్సి నిర్వ‌హించాలి.  ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి భారీగా విస్త‌రిస్తోంది.  ముఖ్యంగా ఢిల్లీలో క‌రోనా కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి.  ఇప్ప‌టికే నైట్ క‌ర్ఫ్యూతో పాటు వీకెండ్ క‌ర్ఫ్యూను కూడా విధించారు.  సినిమా హాల్స్‌, విద్యాసంస్థ‌లు, పార్కులు, జిమ్‌లు వంటివి మూసివేశారు.  ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఇచ్చేశారు.  

Read: బెంగాల్‌లోనూ క‌రోనా దూకుడు… భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు…

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాల‌ని కోరుతూ కొంత‌మంది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.  విచార‌ణ జ‌రిపిన హైకోర్టు ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసేందుకు అనుమ‌తించ‌లేదు.  షెడ్యూల్ ప్ర‌కార‌మే ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని, అయితే, క‌రోనా జాగ్ర‌త్త‌లు తీసుకొని ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశించింది.  కంటైన్మెంట్‌, మైక్రో కంటైన్మెంట్ జోన్ల నుంచి వ‌చ్చే వారి విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, వైర‌స్ సోక‌కుండా అన్ని ఏర్పాట్లు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.  జ‌న‌వ‌రి 7,8,9,15,16 తేదీల్లో మెయిన్స్ ప‌రీక్ష‌లు జ‌ర‌గున్నాయి.  షెడ్యూల్ ప్ర‌కార‌మే పరీక్ష‌లు నిర్వ‌హించాల‌ని కోర్టు స్ప‌ష్టం చేయ‌డంతో అధికారులు ఆ దిశ‌గా ఏర్పాట్లు చేస్తున్నారు.  

Related Articles

Latest Articles