PMSBY: సూపర్ స్కీమ్.. ఏడాదికి రూ. 20 కడితే చాలు రూ.2 లక్షలు ఇస్తున్న కేంద్రం!
- కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్
- పేద వారికి ఆసరాగా ప్రధాన మంత్రి బీమా సురక్ష యోజన
- ఏడాదికి రూ. 20 కడితే చాలు రూ.2 లక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీమా అనేది నేటి రోజుల్లో చాలా ముఖ్యం. ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితి. కాబట్టి ముందుగానే మీరు మీరు బీమా చేయించుకుని ఉన్నట్లైతే ఆపద సమయంలో కుటుంబానికి ఆర్థిక భరోసాను ఇస్తుంది. అయితే బీమా అందరు కొనలేని పరిస్థితి. చాలా మంది పేద వారు వారికి తగిన ఆదాయం లేకపోవడంతో బీమాని కొనలేకపోతున్నారు. అలాంటి పేద ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. పేద వారికి ఆసరాగా ప్రధాన మంత్రి బీమా సురక్ష యోజనను తీసుకొచ్చింది.
ఈ స్కీమ్ లో మీరు కేవలం 20 రూపాయలు కడితే 2 లక్షల రూపాయల బీమాని పొందవచ్చు. 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్య ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ యాన్యువల్ ప్రీమియం కేవలం రూ.20 మాత్రమే. అంటే ఇందులో మీరు సంవత్సరానికి 20 రూపాయలు కడితే చాలు. అయితే ఈ పాలసీని ప్రతి సంవత్సరం కూడా రెన్యూవల్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే బీమా డబ్బులు వస్తాయి. ఈ స్కీమ్ లో చేరిన పాలసీదారు ప్రమాదవశాత్తు చనిపోయినా లేదా అనారోగ్యంతో మరణించినా వారి కుటుంబానికి రూ.2 లక్షల డబ్బుని చెల్లిస్తారు. అలాగే ఏదైనా ప్రమాదంలో పాలసీదారు రెండు కళ్లు పోగొట్టుకున్నా కూడా వారి కుటుంబానికి రూ.2 లక్షలు చెల్లిస్తారు.
Also Read
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
రెండు చేతులు, రెండు కాళ్లు వైకల్యం కలిగి ఉన్నా కూడా బీమా కట్టిన వారి కుటుంబానికి పరిహారంగా రూ.2 లక్షల డబ్బుని ఇస్తారు. అలాగే బీమా చేయించుకున్న వ్యక్తి ప్రమాదంలో ఒక కాలు, చేయి లేదా ఒక కన్ను పోగొట్టుకుంటే రూ.1 లక్ష ఇస్తారు. ఇక ఈ ప్రధాన మంత్రి బీమా సురక్ష యోజన స్కీమ్ కి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి మీరు అధికారిక వెబ్‌సైట్ https://www.jansuraksha.gov.in/ని ఓపెన్ చేయాలి.
ఇక ఆ తర్వాత మీరు ఫారమ్‌లపై క్లిక్ చేయాలి. అక్కడ మీరు ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు అప్లికేషన్ ఫారమ్‌పై క్లిక్ చేసి, తరువాత మీ భాషను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫారమ్‌లో అడిగిన మొత్తం ఇన్ఫర్మేషన్ ని తప్పనిసరిగా ఫిల్ చేయాలి. ఇంకా దీనితో పాటు మీరు అందులో అడిగిన డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసి ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి. ఈ స్కీమ్ కి ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలంటే మీరు మీ బ్యాంకుకి వెళ్ళాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు