Vedanta Demerger: బంపర్ ఆఫర్.. ఈ ఒక్క షేరు ఉంటే.. ఆరు షేర్లు మీ సొంతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vedanta Demerger: ప్రముఖ మైనింగ్, మెటల్స్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ పెట్టుబడిదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ వేదాంత గ్రూపులో భారీ డీమెర్జర్ ప్రక్రియను ధృవీకరించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రక్రియ ద్వారా వేదాంత లిమిటెడ్ ఐదు కొత్త స్వతంత్ర కంపెనీలుగా విడిపోనుందని తెలిపారు. నిజానికి ఈ డీమెర్జర్ ప్రక్రియ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోను భారీగా పెంచనుంది. ప్రస్తుతం మీ దగ్గర వేదాంత లిమిటెడ్‌కు చెందిన ఒక్క షేరు ఉంటే, డీమెర్జర్ పూర్తయిన తర్వాత మీ వద్ద మొత్తం 6 షేర్లు ఉంటాయి.
READ ALSO: Hema: హేమకు క్లీన్ చీట్.. చనిపోవాలి అనుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్!
Also Read
- SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
- RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
- Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
కొత్తగా రాబోతున్న 5 కంపెనీలు ఇవే:
వ్యాపార కార్యకలాపాలను సరళీకృతం చేసేందుకు అనిల్ అగర్వాల్ వేదాంతను కింది ఐదు విభాగాలుగా విడగొడుతున్నట్లు తెలిపారు.
* వేదాంత అల్యూమినియం: అల్యూమినియం ఉత్పత్తి, వ్యాపారం.
* వేదాంత ఆయిల్ & గ్యాస్: చమురు, సహజ వాయువు రంగం.
* వేదాంత స్టీల్ & ఫెర్రస్: ఇనుము, ఉక్కు వ్యాపారం.
* వేదాంత బేస్ మెటల్స్: రాగి, జింక్ వంటి లోహాలపై దృష్టి.
* వేదాంత పవర్: విద్యుత్ ఉత్పత్తి రంగాన్ని పర్యవేక్షిస్తుంది.
ఈ ఐదు కంపెనీలకు మాతృ సంస్థ అయిన వేదాంత లిమిటెడ్ ఇకపై కేవలం పెట్టుబడులు, సెమీకండక్టర్ల వంటి భవిష్యత్ టెక్నాలజీ ప్రాజెక్టులపై మాత్రమే దృష్టి సారిస్తుందని తెలిపారు.
ఈ భారీ నిర్ణయానికి కారణం ఇదే..
వేదాంత ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 2025 డిసెంబర్ నాటికి కంపెనీపై రూ.60,624 కోట్ల అప్పు ఉంది. రాబోయే మూడేళ్లలో సుమారు $3 బిలియన్ల రుణాన్ని తగ్గించుకోవాలని అనిల్ అగర్వాల్ లక్ష్యంగా పెట్టుకున్నారు. విడిపోయిన కంపెనీలలో వాటాలను విక్రయించడం ద్వారా ఈ అప్పు తీర్చడం సులభమవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారని సమాచారం. ప్రస్తుతం ఉన్న $27 బిలియన్ల మార్కెట్ క్యాప్, ఐదు కంపెనీలు విడిపోయిన తర్వాత అంతకంటే ఎక్కువ విలువను సంతరించుకుంటుందని కంపెనీ ఆశిస్తోంది. ఇప్పటివరకు ఆయిల్, గ్యాస్, పవర్ వంటి అన్ని వ్యాపారాలన్నీ ఒకే గొడుగు కింద ఉండేవి. ఇకపై ఇన్వెస్టర్లు తమకు నచ్చిన రంగంలో (ఉదాహరణకు కేవలం పవర్ లేదా ఆయిల్ రంగంలో మాత్రమే) పెట్టుబడి పెట్టే అవకాశం లభిస్తుంది. ప్రతి కంపెనీకి ప్రత్యేక బోర్డ్, యాజమాన్యం ఉండటం వల్ల నిర్ణయాలు వేగంగా జరిగి లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ వేదాంత ఇన్వెస్టర్లకు ఒక లాటరీ వంటిదని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అప్పుల బాధ నుంచి విముక్తి పొంది, కొత్త కంపెనీలతో వేదాంత గ్రూప్ స్టాక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందో లేదో చూడాలి.
READ ALSO: Nisha Mehta: నేపాల్ ఆరోగ్య మంత్రిగా ఢిల్లీ ఎయిమ్స్ విద్యార్థి..!
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?