Business Headlines 28-02-23: అమరరాజా ఆర్ అండ్ డీ: అమరరాజా బ్యాటరీస్ సంస్థ.. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ని ఏర్పాటుచేయనుంది. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలో ఉన్న జీఎంఆర్ ఏరోసిటీలో ఈ ‘‘ఆర్ అండ్ డీ’’ కేంద్రాన్ని అందుబాటులోకి తేనుంది. ఇ-హబ్ పేరుతో సుమారు ఏడెకరాల విస్తీర్ణంలో నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు తమ గిగా కారిడార్ ప్రోగ్రామ్‌లో భాగమని అమరరాజా కంపెనీ తెలిపింది. ఈ కార్యక్రమం విలువ 9 వేల 500 కోట్ల రూపాయలని పేర్కొంది.
Vedanta Group: ఈ మధ్య అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీకి సంబంధించిన వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి.. ఆయన సంస్థలు గడ్డుకాలాన్ని ఎదుర్కుంటున్నాయని.. అప్పుల కుప్పలుగా మారిపోయాయని వాటి సారాంశం.. అధిక పరపతి కలిగిన భారతీయ వ్యాపారవేత్తలు గడ్డు సమయాన్ని ఎదుర్కొంటున్నారు. గౌతమ్ అదానీ యొక్క 236 బిలియన్ డాలర్ల మౌలిక సదుపాయాల సామ్రాజ్యం ఒక నెలలో మూడు వంతుల కంటే ఎక్కువ తగ్గిపోయింది. అయితే, మరొక ప్రసిద్ధ వ్యక్తి కోసం చిన్న తుఫాన్ ఏర్పడవచ్చు…
Special Story on Anil Agarwal: అనిల్ అగర్వాల్.. వ్యాపార రంగంలో ఐదు దశాబ్దాల సుదీర్ఘ కాలం ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఇవాళ ఇండియన్ మెటల్ అండ్ మైనింగ్ మ్యాగ్నెట్‌గా ఎదిగారు. ఒక్క రోజు కూడా కాలేజీకి గానీ బిజినెస్ స్కూల్‌కి గానీ వెళ్లకుండానే ఆయన ఇదంతా సాధించగలగటం విశేషం. ఇంగ్లిష్‌లో ఎస్ అండ్ నో అనే రెండు పదాలు మాత్రమే తెలిసిన అనిల్ అగర్వాల్.. ఒకానొక దశలో ఆ ఇంగ్లిష్ కంట్రీ బ్రిటన్ నడిబొడ్డున ఇండియా…