Hema: హేమకు క్లీన్ చీట్.. చనిపోవాలి అనుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, అందరికీ సుపరిచితురాలైన నటి హేమ గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న డ్రగ్స్ కేసు వివాదంపై తొలిసారిగా బహిరంగంగా స్పందించారు, ఇటీవల నటి హేమకు క్లీన్ చీట్ వచ్చింది. సోమవారం హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఆమె తన మనసులోని ఆవేదనను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు తనను ఎంతలా కుంగదీశాయో చెబుతూ హేమ కన్నీటి పర్యంతమయ్యారు. “ఒకానొక దశలో భరించలేక చనిపోవాలని కూడా నిర్ణయించుకున్నాను. అంతలా మానసిక వేదనను అనుభవించాను” అని ఆమె పేర్కొన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని గట్టిగా నమ్మానని, అందుకే న్యాయపోరాటం చేసి చివరికి కోర్టులో నిర్దోషిగా బయటపడ్డానని ఆమె స్పష్టం చేశారు.
Also Read
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
ముఖ్యంగా కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలు తెలుసుకోకుండా తనపై బురదజల్లాయని హేమ ఆరోపించారు, ఈ తప్పుడు వార్తల వల్ల తన వ్యక్తిగత జీవితమే కాకుండా, తన కుటుంబ సభ్యులు కూడా సమాజంలో తలదించుకోవాల్సి వచ్చిందని, వారు అనుభవించిన నరకం అంతా ఇంతా కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, నిజాయితీగా ఉండే మీడియా తన పక్షాన నిలుస్తుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇక నటిగా దశాబ్దాల కాలం పాటు ప్రేక్షకులను అలరించిన హేమ, ఈ వివాదం నుండి బయటపడి మళ్లీ తన కెరీర్‌పై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. తనపై నమ్మకం ఉంచిన వారికి భవిష్యత్తులోనూ అండగా ఉంటానని ఆమె ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
-
PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
-
Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!