New SIM card rules: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతగా డెవలప్మెంట్ చెందిందో చూస్తూన్నాం.. అయితే, ఇటీవల ఎక్కువగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి. చాలా మంది సైబర్ మోసాల బారిన పడి తమ ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు. ఈ సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త ప్లాన్స్‌తో ప్రజలను మోసం చేస్తున్నారు. దీంతో వినియోగదారులు సైబర్ మోసాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని ట్రాయ్ పేర్కొనింది. ఇక, ప్రస్తుతం విపరీతంగా పెరుగుతున్న స్పామ్ కాల్స్, సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకుని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ కొత్త రూల్ ను అమల్లోకి తీసుకొస్తోంది. టెలికాం రంగంలో మోసపూరిత కార్యకలాపాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి.. ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.
Read Also: IND vs AUS Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విజయం ఆ జట్టుదే.. జోస్యం చెప్పిన మాజీ దిగ్గజం
అయితే, నకిలీ స్పామ్ కాల్స్‌ను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ట్రాయ్ కొత్త రూల్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. వ్యక్తిగత ఫోన్ నెంబర్ నుంచి మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ చేస్తే టెలికం ప్రొవైడర్ ఆ నంబర్‌ను రెండేళ్లు బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. స్పామ్ కాల్స్ పేరుతో పెద్ద ఎత్తున మోసాలు పెరిగిపోతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అటు స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌కు భారీగా కనెక్షన్లు వాడే సంస్థలను బ్లాక్‌లిస్టులో చేర్చాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. కస్టమర్ల సమస్యలకు చెక్ పెట్టేందుకు నిబంధనలను మరింత కఠినతరం చేయబోతుందని చెప్పుకొచ్చింది. ఈ మేరకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌కు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది.