New SIM card rules: నకిలీ స్పామ్ కాల్స్‌ను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ట్రాయ్ కొత్త రూల్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. వ్యక్తిగత ఫోన్ నెంబర్ నుంచి మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ చేస్తే టెలికం ప్రొవైడర్ ఆ నంబర్‌ను రెండేళ్లు బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
TRAI: స్పామ్ కాల్స్ విషయంలో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ నెట్‌వర్క్ కంపెనీలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. రిజిస్టర్ చేయని టెలీ మార్కెటింగ్ వారి నుంచి ప్రమోషనల్ కాల్స్ లేదా రికార్డ్ చేసిన, కంప్యూటర్ ఆధారిత వాయిస్ కాల్స్‌ను తక్షణ నిలిపివేయాలని స్పష్టం చేసింది.