బంగారం ధరలు ఓరోజు పెరుగుతు, ఓరోజు తగ్గుతు, మరో రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. శుభకార్యాలకు పసిడి కొనాలనుకునే వారికి షాకిచ్చాయి. పుత్తడి ధరలు అంతకంతకు పెరుగుతుండడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. కాగా నిన్నటి వరకు పెరిగిన గోల్డ్ ధరలు నేడు ఊరట కలిగించాయి. ఇవాళ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటితో పోల్చితే గోల్డ్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మరి ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 7,945, 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,667 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.79,450వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.86,670 వద్ద అమ్ముడవుతోంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.79,450, 24 క్యారెట్ల ధర రూ.86,670 వద్దకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.79,600 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.86,820 వద్ద ట్రేడ్ అవుతోంది.
నేడు బంగారంతోపాటు వెండి ధరలు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి. నిన్నటితో పోల్చితే సిల్వర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ లో నేడు కిలో వెండి ధర రూ. 1,07,000 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,07,000 వద్ద అమ్ముడవుతోంది. ఇక ఢిల్లీలో కిలో వెండి ధర రూ.99,500 స్థిరంగా కొనసాగుతోంది. బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉండడంతో గోల్డ్ లవర్స్ హమ్మయ్యా.. అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు.