Tina Ambani: అంబానీ కుటుంబంలో విషాదం.. కన్నీళ్లు పెట్టుకున్న టీనా అంబానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tina Ambani: అనీల్ అంబానీ భార్య, ఒకప్పటి బాలీవుడ్ నటి టీనా అంబానీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె పెద్ద సోదరి ‘జన్హా’ తాజాగా కన్నుమూశారు. తనకు తల్లిలాంటి తోడును కోల్పోయానంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె పెట్టిన ఎమోషనల్ పోస్ట్ వైరల్‌గా మారింది. తన అక్కతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ టీనా అంబానీ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అరుదైన ఫోటోలను పంచుకున్నారు. “నా పెద్దక్క జన్హా నాకు రెండో తల్లి లాంటిది. నా పెళ్లి సమయంలో ఆమె స్వయంగా నా కన్యాదానం చేసి, నన్ను నా మెట్టినింటికి సాగనంపింది. మా కుటుంబం మొత్తానికి ఆమె ఒక ముఖ్యమైన వ్యక్తి” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
READ ALSO: SDT 19: మెగా మేనల్లుడితో ‘క’ డైరెక్టర్స్ క్రేజీ ప్రాజెక్ట్.. అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూశారా
Also Read
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
- UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
ఆమె గ్రేస్, ఎనర్జీ తమ సోదరీమణులకే కాకుండా, పిల్లలకు, మనవళ్లకు కూడా ఎంతో స్ఫూర్తినిచ్చేవని టీనా పేర్కొన్నారు. “మీరు వెళ్ళిపోయి మా జీవితాల్లో ఎప్పటికీ పూడ్చలేని వెలితిని మిగిల్చారు. మీ ప్రేమ తరతరాలకు వారసత్వంగా నిలుస్తుంది. ఓం శాంతి జయా!” అంటూ తన సోదరికి నివాళులర్పించారు. టీనా అంబానీ (టీనా మునిమ్) ఒకప్పుడు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణించారు. 1978లో ‘దేశ్ పరదేశ్’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆమె.. కర్జ్, రాకీ, పుకార్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. 1991లో అనిల్ అంబానీని వివాహం చేసుకున్న తర్వాత ఆమె వెండితెరకు దూరమయ్యారు. ఆమె చివరిగా 1991లో ‘జిగర్‌వాలా’ సినిమాలో కనిపించారు. టీనా- అనీల్ అంబానీలకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం టీనా అంబానీ సోదరి మరణవార్త తెలుసుకున్న అభిమానులు, ప్రముఖులు ఆమెకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ కష్టకాలంలో ఆమెకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆమె పోస్ట్‌కు కామెంట్స్ చేస్తున్నారు.
READ ALSO: Kitchen Tips: మాడిన గిన్నెలను నిమిషాల్లో కొత్త దానిలా మెరిపించే సింపుల్ చిట్కాలు ఇవే!
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!