SDT 19: మెగా మేనల్లుడితో ‘క’ డైరెక్టర్స్ క్రేజీ ప్రాజెక్ట్.. అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూశారా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SDT 19: టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తన తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు. కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ‘క’ సినిమాతో సక్సెస్‌పుల్ డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్న సుజిత్, సందీప్ దర్శకత్వంలో మెగా మేనల్లుడు తన 19వ సినిమా (SDT 19) చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. ఒక పౌరాణిక యోధుడి గెటప్‌లో, చేతిలో కత్తి పట్టుకుని కొండపై నిలబడిన సాయి దుర్గ తేజ్ లుక్ పవర్ ఫుల్‌గా ఉంది. “యుగాల రహస్యాలు.. ఊహకు అందని శక్తి.. ఒక కొత్త పౌరాణిక శక్తి ఉదయిస్తోంది” అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేసింది.
READ ALSO: Exclusive : రామ్ చరణ్ ‘పెద్ది’ ఏప్రిల్ 30న రిలీజ్ ఫిక్స్.. బుకింగ్స్ ఓపెన్
Also Read
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
- Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
తమ మొదటి సినిమాతోనే స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఏంటో డైరెక్టర్స్ సుజిత్-సందీప్ (‘క’ ఫేమ్) చూపించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గార్లపాటి నిర్మిస్తున్నారు. ఇది ఒక పీరియడ్ మిస్టరీ థ్రిల్లర్ లేదా మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే సాయి దుర్గ తేజ్ హీరోగా రోహిత్ కెపి దర్శకత్వంలో ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా (SDT 18) తెరకెక్కుతుంది. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ‘క’ దర్శకులతో మరో భారీ చిత్రాన్ని పట్టాలెక్కించడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విరూపాక్ష వంటి సక్సెస్ సినిమా తర్వాత ఈ మెగా హీరో అద్భుతమైన కథతో బాక్సాఫీస్ వద్ద రాబోతుండటంతో ‘మెగా’ హిట్ ఖాయమని ఫ్యాన్స్‌తో పాటు విశ్లేషకులు భావిస్తున్నారు.
Secrets of the ages… ✨
Power beyond imagination. ⚡A new mythic force rises. ⚔️
Excited to bring this powerful vision to life with the Mega Supreme Hero @IamSaiDharamTej garu and Sensational duo @Dir_Sujith & @Dir_SandeepM ❤️🔥#SDT19 #CosmicChronicles@Shine_Screens… pic.twitter.com/BYYAyfbdlO
— Sahu Garapati (@sahugarapati7) April 3, 2026
READ ALSO: Kitchen Tips: మాడిన గిన్నెలను నిమిషాల్లో కొత్త దానిలా మెరిపించే సింపుల్ చిట్కాలు ఇవే!
తాజావార్తలు
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!