Kitchen Tips: మాడిన గిన్నెలను నిమిషాల్లో కొత్త దానిలా మెరిపించే సింపుల్ చిట్కాలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kitchen Tips: ఉరుకుల పరుగుల జీవితంలో వంట చేసేటప్పుడు అప్పుడప్పుడు గిన్నెలు మాడిపోవడం సహజం. ముఖ్యంగా పాలు మరిగించేటప్పుడో లేదా కూరలు వండేటప్పుడో కాస్త అటు ఇటు అయితే చాలు, గిన్నె అడుగు భాగం నల్లగా మాడిపోతుంది. అలాంటి మాడిన గిన్నెలను తోమడం అనేది ఇంట్లో వాళ్లకు ఒక పెద్ద సవాలుతో కూడిన పని. ఎంత గట్టిగా రుద్దినా ఆ మాడిపోయిన నలుపు మరకలు అంత ఈజీగా వదలవు. దీని గురించి ఇకపై అస్సలు కంగారు పడక్కర్లేదు. పనికిరాదు అనుకుని పక్కన పడేసిన మాడిన గిన్నెలను కూడా కేవలం ఐదు నిమిషాల్లో కొత్త దానిలా మెరిపించే ఒక అద్భుతమైన చిట్కా ఈ స్టోరీలో తెలుసుకుందాం. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో సులభంగా ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఎలా చేయాలో చదివేయండి.
READ ALSO: CM Revanth: తెలంగాణను దక్షిణ ఆసియా టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చుదిద్దుతాం..
Also Read
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
మాడిన గిన్నెలను శుభ్రం చేయడానికి కావలసినవి:
వంట సోడా (Baking Soda) – 1 టీస్పూన్
సర్ఫ్ లేదా డిష్ వాష్ లిక్విడ్ – 1 టీస్పూన్
నీళ్లు – గిన్నెలో సగం వరకు
నిమ్మరసం – సగం చెక్క (అవసరమైతే)
ఇలా శుభ్రం చేయండి..
ముందుగా మాడిన గిన్నెలో సగం వరకు నీటిని పోయాలి. తర్వాత అందులో ఒక టీస్పూన్ వంట సోడా, ఒక టీస్పూన్ సర్ఫ్ లేదా డిష్ వాష్ లిక్విడ్ వేయాలి. అనంతరం ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి, నీటిని బాగా మరిగించాలి. తర్వాత నీళ్లు మరుగుతున్నప్పుడు లోపల ఉన్న మాడంతా మెల్లమెల్లగా వదిలి పైకి రావడం జరుగుతుంది. ఆ టైంలో మీరు స్పూన్‌తో అడుగున గీకితే మాడంతా సులభంగా పోతుంది. నీరు బాగా మరిగి, మాడంతా వదిలిన తర్వాత ఆ నీటిని పారబోయాలి. చివరగా గిన్నెను సాధారణ డిష్ వాష్ సోపు, స్క్రబ్బర్‌తో ఒకసారి తోమితే, గిన్నె కొత్త దానిలా తళతళలాడుతుంది. ఈ చిట్కా ద్వారా స్టీల్ గిన్నెలే కాకుండా, అల్యూమినియం గిన్నెలను కూడా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. ఇకపై మీ ఇంట్లో గిన్నెలు మాడిపోతే కంగారు పడకుండా ఇలా సింపుల్‌గా క్లీన్ చేసుకోండి.
READ ALSO: TVK Chief Vijay: చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్.. నామినేషన్ రద్దయ్యే ఛాన్స్?
తాజావార్తలు
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!