టాటా గ్రూప్స్ తగ్గేదేలే అంటూ మరింత ముందుకు దూసుకుపోతోంది. అయితే ఇటీవల ఎయిరిండియాను సొంతం చేసుకున్న టాటాగ్రూప్స్ మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టబోతోంది. టాటా గ్రూప్స్ త్వరలోనే డిజిటల్ ఎకానమీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఎన్నో సంవత్సరాల నుంచి డిజిటల్ ఎకానమీలో అగ్రస్థానంలో ఉన్న అమెజాన్, జియో, ప్లిప్ కార్ట్ లాంటి సంస్థలకు షాక్ ఇచ్చే విధంగా టాటా గ్రూప్స్ ఓ యాప్ ను లాంచ్ చేయబోతోంది. ఈ యాప్ ను ఈ నెల 7వ తేదిన లాంచ్ చేయనున్నట్లు టాటా గ్రూప్స్ ప్రతినిధులు వెల్ల డించారు. అయితే యాప్ పేరు టాటా నీయూ ( TATA NEU)గా నామకరణం చేశారు. అయితే ఈ యాప్ లో అటూ షాపింగ్‌తో పాటుగా…చెల్లింపుల కోసం యూపీఐ యాప్‌ను టాటా గ్రూప్ త్వరలోనే లాంచ్ చేయనుంది. యాప్ సహాయంతో కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను,భారీ బెనిఫిట్స్‌ను, టాటా గ్రూప్స్ అందించనుంది.
ఈ యాప్‌లో షాపింగ్, ఫ్లైట్, హోటల్ బుకింగ్ వంటి సదుపాయాలతో పాటు స్టోర్‌లలో కొనుగోలు చేసిన వస్తువులు, యుటిలిటీ బిల్లులకు చెల్లించే చెల్లింపు సౌకర్యాన్ని టాటా నీయూ అందించనుంది. వాటితో పాటుగా కస్టమర్లు జరిపే కొనుగోళ్లపై రివార్డులను కూడా ఇవ్వనుంది. కొంతకాలంగా టాటా గ్రూప్స్ తన ఉద్యోగులతో నీయూ యాప్‌ను పరీక్షిస్తోంది. ఇక బిగ్ బాస్కెట్, 1mg కంపెనీలు అందించే లాయల్టీ పాయింట్స్ బదులుగా నీయూ కాయిన్స్ అందించనున్నట్లు తెలుస్తోంది. కిరాణా సామాగ్రి నుంచి గాడ్జెట్‌ల వరకు, టాటా నీయూ యాప్‌లో కొనుగోలు చేయవచ్చును. వీటికి చెల్లింపులను జరిపేందుకు గూగుల్ పే, ఫోన్ పే తరహాలో ‘టాటా పే’ యూపీఐ యాప్‌ను టాటా గ్రూప్స్ అందుబాటులోకి తీసుకురానుంది.