Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Supreme Court Key Words On Demonetisation

Demonetisation: నోట్ల రద్దుపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు

Published Date :November 9, 2022 , 4:58 pm
By Ramesh Nalam
Demonetisation: నోట్ల రద్దుపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Demonetisation: 2016లో బీజేపీ ప్రభుత్వం నోట్ల రద్దు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పటికీ నోట్ల రద్దు ఎఫెక్ట్ భారత ఆర్ధిక వ్యవస్థపై కొనసాగుతుంది. నోట్ల రద్దు కారణంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రూ.2వేలు నోటుతో సామాన్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2016 నాటి నోట్ల రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం నాడు ఈ పిటిషన్‌లను ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్, జస్టిస్ బీవీ నాగరత్న సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌లను విచారించింది.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నోట్ల రద్దు వ్యవహారంపై ఇంకా చర్చించడంపై అసహనం వ్యక్తం చేసింది. ఇంకా ఇంకా ఈ కేసు విచారణ పడుతుండటం సరికాదని అభిప్రాయపడింది. ఈ సంవత్సరంలోనే ఈ కేసు విచారణను ముగించాలని అనుకుంటున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. పిటిషన్లపై ప్రభుత్వ స్పందనను, నోట్ల రద్దు నిర్ణయానికి కారణాలను సమగ్ర అఫిడవిట్ రూపంలో అందించాలని కేంద్రాన్ని, ఆర్బీఐని కోర్టు గత విచారణ సందర్భంగానే కోరింది. అయితే బుధవారం సదరు అఫిడవిట్‌ను అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సుప్రీం కోర్టుకు సమర్పించలేకపోయారు. అఫిడవిట్ సమర్పణకు మరోవారం సమయం కావాలని అటార్నీ జనరల్ కోరారు.

Read Also: Sai Pallavi: ఇప్పటివరకు ఆ పని చేయని ఏకైక హీరోయిన్ సాయి పల్లవి

మరోవైపు రూ.2000 నోట్ల ముద్రణపై ఆసక్తికరమైన విషయం ఆర్టీఐ ద్వారా వెలుగు చూసింది. గత మూడు సంవత్సరాల్లో రూ.2000ల ఒక్క నోటు కూడా ముద్రించలేదని ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి సమాధానం వచ్చింది. కాగా 2016-17లో 3,542.991 మిలియన్‌ 2వేల రూపాయల నోట్లను ముద్రించారని చెప్పింది. కాగా నవంబర్ 8, 2016లో రూ.500, 1000 నోట్ల రద్దు తర్వాత రూ.2000 నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • business news
  • central government
  • demonestisation
  • national news

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions