Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
- కొండెక్కిన చక్కెర ధర
- కీలక పండుగల వేళ ధరలకు రెక్కలు
- కేంద్రం కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో చక్కెర ధరలు కొండెక్కుతున్నాయి. వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్న తరుణంలో పంచదార ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. కిలో రూ.65కు పెరిగిపోయింది. ఇక మహారాష్ట్రలో ఎక్స్-మిల్ చక్కెర ధరలు క్వింటాల్‌కు రూ.5,400 నుంచి రూ.5,560కి పెరిగింది. పైగా దేశంలో చక్కెర నిల్వలు కూడా అయిపోయాయి. ఈ నేపథ్యంలో ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో వ్యాపారులు కూడా బల్క్‌లో పెద్ద ఎత్తున కొనుగోళ్లకు సిద్ధపడుతుండడంతో ఉన్న నిల్వలు అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారిగా చక్కెరను దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా దిగుమతి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దేశీయంగా చక్కెర నిల్వలు తగ్గిపోవడం, ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో.. పండుగల సీజన్ ముందు వినియోగదారులపై భారం తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read
- Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
- Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు... క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
- Helicopter Crash: కూలిన హెలికాప్టర్.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐదుగురు అమెరికా పౌరులతో సహా ఏడుగురు మృతి
- Gold Price Today: ఒక్కరోజే రూ.4,300 పెరిగిన బంగారం ధర.. వెండి కూడా భగ్గుమంటోంది!
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ గురువారం ముడి చక్కెర దిగుమతి విధానంలో మార్పులు చేసింది. టారిఫ్ రేట్ కోటా కింద 10 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ముడి చక్కెరను డ్యూటీ లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. టారిఫ్ రేట్ కోటా విధానంలో నిర్దిష్ట పరిమాణంలో వస్తువులను తక్కువ లేదా సున్నా కస్టమ్స్ డ్యూటీతో దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఈ డ్యూటీ ఫ్రీ దిగుమతుల పరిమితిని 10 లక్షల టన్నులుగా నిర్ణయించారు. ఈ అవకాశం 2026 అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
దేశంలో చక్కెర ధరలు కేవలం రెండు నెలల్లోనే దాదాపు 40 శాతం పెరిగాయి. దేశీయంగా సరఫరాలు తగ్గిపోవడంతో ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం వినియోగదారులపై మరింత భారం మోపే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా చక్కెరను వినియోగించే దేశం భారత్. దీంతో దేశీయ మార్కెట్లో సరఫరాలను పెంచి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దిగుమతుల మార్గాన్ని ఎంచుకుంది.
దేశీయ మార్కెట్లో చక్కెర ధరలను తగ్గించేందుకు కేంద్రం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు చక్కెర వ్యాపారులు, డీలర్లపై స్టాక్ పరిమితులను విధించింది. చక్కెరను అక్రమంగా నిల్వ చేయడం, ఊహాజనిత ట్రేడింగ్‌ను అడ్డుకోవడంతో పాటు మార్కెట్లో తగినంత సరఫరా ఉండేలా చూసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
- Tags
- india
- market
- Sugar
- SUGAR PRICE HIKE
తాజావార్తలు
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?