Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
- రైల్వే ప్రయాణికులకు అలర్ట్..
- 15 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. వివిధ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ నిర్వహణ పనులు మరియు భద్రతా కారణాల దృష్ట్యా సుమారు 15 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. దీనివల్ల నిత్యం రైళ్లలో ప్రయాణించే వేల మంది ప్రయాణికులపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య నడిచే మెము (MEMU) , డెము (DEMU) రైళ్లు ఈ రద్దు జాబితాలో ఉన్నాయి.
విజయవాడ, విశాఖపట్నం, కాచిగూడ, గుంటూరు , సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి నడిచే లోకల్ రైళ్లు ఎక్కువగా రద్దయ్యాయి. వేసవి కాలం కావడంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం కొంత ఇబ్బందికరమైనప్పటికీ.. సురక్షిత ప్రయాణం కోసం ట్రాక్ మరమ్మతులు అత్యవసరమని అధికారులు స్పష్టం చేశారు. కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. ఇంకొన్ని రైళ్ల సమయాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.
Also Read
- Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
- పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
Also Read:Post Jobs: పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు..
ఈ 15 రైళ్ల రద్దు ఏప్రిల్ 12, 2026 వరకు అమలులో ఉంటుంది. రద్దైన రైళ్ల వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ – విశాఖపట్నం (07466/07467), కాకినాడ పోర్ట్ – విశాఖపట్నం (07456/07457), విజయవాడ – తెనాలి (07282/07279), విజయవాడ – ఒంగోలు (07278/07476), గుంటూరు – తెనాలి (07575/07440), విశాఖపట్నం – మచిలీపట్నం (17220), మచిలీపట్నం – విశాఖపట్నం (17219).
ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే ముందు రైల్వే ఎంక్వయిరీ లేదా ‘నేషనల్ ట్రైన్ ఎంక్వయిరీ సిస్టమ్’ (NTES) యాప్ ద్వారా రైళ్ల స్థితిగతులను తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. స్టేషన్లకు వెళ్లిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉండేందుకు రైల్వే వెబ్‌సైట్‌ను కూడా పరిశీలించాలని కోరారు. రద్దైన రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ద్వారా తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోవచ్చు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!