Silver Hallmarking: ఏదైనా విలువైన వస్తువు ధర పెరిగితే దానిని బంగారంలో పోల్చడం ఎక్కడైనా సాధారణంగా కనిపిస్తుంది. తాజా వెండిని కూడా బంగారం కాను అని అంటున్నారు. ఎందుకంటే దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త రూల్‌తో వెండి ధరలకు రెక్కలు రానున్నట్లు సమాచారం. వెండి స్వచ్ఛతను నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. ఇప్పటివరకు బంగారు ఆభరణాలపై మాత్రమే హాల్‌మార్కింగ్ తప్పనిసరిగా ఉండే, కానీ ఇప్పుడు వెండికి కూడా అదే వ్యవస్థను తీసుకువస్తున్నారు. ఈ వెండి హాల్‌మార్కింగ్ ప్రక్రియ 2025 సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది.
READ ALSO: Asia Cup 2025: 15 మందిలో ఆ ముగ్గురే గేమ్ ఛేంజర్లు.. సెహ్వాగ్ లిస్టులో లేని స్టార్స్!
భవిష్యత్తులో హాల్ మార్కింగ్ తప్పని సరి..
వెండికి ప్రారంభంలో హాల్ మార్కింగ్ నియమం స్వచ్ఛందంగా ఉండనున్నట్లు సమాచారం. అంటే వినియోగదారులు కావాలనుకుంటే హాల్‌మార్క్ చేసిన వెండిని కొనుగోలు చేయవచ్చు. లేదంటే హాల్‌మార్క్ చేయని వెండిని కూడా కొనుగోలు చేయవచ్చు. కానీ హాల్ మార్క్ అనేది భవిష్యత్తులో తప్పనిసరి అయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు కొనుగోలుదారులు బంగారం మాదిరిగానే వెండిలో కూడా నాణ్యత ముద్రను కోరుకుంటున్నారు. హాల్ మార్కింగ్‌తో కొనుగోలు మరింత పారదర్శకంగా, నమ్మదగినదిగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెండికి ఆరు వేర్వేరు స్వచ్ఛత ప్రమాణాలను నిర్ణయించింది. వీటిని నగలు లేదా వస్తువులపై గుర్తు పెడతారు. ప్రతి సంఖ్య వెండి ఎంత స్వచ్ఛమైనదో సూచిస్తుందని తెలిపింది.
హాల్‌మార్కింగ్ తర్వాత వెండి ఖరీదైనదిగా మారుతుందా లేదా అనే ప్రశ్న మార్కెట్లో తలెత్తడం ప్రారంభమైంది. దీని వల్ల ధరలపై ప్రత్యక్ష ప్రభావం ఉండదని నిపుణులు భావిస్తున్నారు. దీంతో కస్టమర్ల విశ్వాసం పెరుగుతుందని, దీని కారణంగా హాల్‌మార్క్ చేసిన వెండికి డిమాండ్ పెరగవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హాల్‌మార్కింగ్ అనేది ప్రామాణికతకు ముద్ర, ఇది కస్టమర్ కొనుగోలు చేస్తున్న వెండి ఎంత శాతం స్వచ్ఛమైనదో తెలియజేస్తుందని చెబుతున్నారు. ఇది కొనుగోలులో మోసం పరిధిని తగ్గిస్తుందని, వినియోగదారుడు తమ డబ్బుతో నాణ్యమైన ఉత్పత్తిని పొందుతారని చెప్పారు.
సంఖ్య వెండి స్వచ్ఛతను తెలియజేస్తుంది…
800 స్టాంప్: ఇందులో 80% స్వచ్ఛమైన వెండి ఉంటుంది. మిగిలిన 20% రాగి వంటి ఇతర లోహాలతో కలుపుతారు.
835 స్టాంప్: 83.5% స్వచ్ఛత కలిగిన వెండిని సూచిస్తుంది.
900 స్టాంప్: ఇందులో 90% స్వచ్ఛమైన వెండి ఉంటుంది. దీనిని సాధారణంగా నాణేలు, ప్రత్యేక ఆభరణాలలో ఉపయోగిస్తారు.
925 స్టాంప్: ఇది అత్యంత ప్రజాదరణ పొందిన గ్రేడ్. దీనిని “స్టెర్లింగ్ సిల్వర్” అని పిలుస్తారు. దీని స్వచ్ఛత 92.5%.
970 స్టాంప్: ఇది 97% స్వచ్ఛమైన వెండి. దీనిని ప్రత్యేక పాత్రలు, డిజైనర్ ఆభరణాలలో ఉపయోగిస్తారు.
990 స్టాంపు: దీనిని ఫైన్ సిల్వర్ అంటారు. ఇందులో వెండి 99% స్వచ్ఛమైనది. ఇది చాలా మృదువైనదిగా ఉంటుంది. కాబట్టి దీనిని బార్లు, నాణేలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
READ ALSO: Father Kills Daughter: 17 ఏళ్ల కుమార్తెను చంపిన తండ్రి.. భర్తను పట్టించిన భార్య..