Father Kills Daughter: 17 ఏళ్ల కుమార్తెను కన్న తండ్రి హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. తర్వాత ఆ తండ్రి పథకం ప్రకారం.. తన కుమార్తెది హత్య కాదు, ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. ఇది మాత్రమే కాకుండా హడావిడిగా అంత్యక్రియలు నిర్వహించడంతో పాటు బూడిదను కూడా నదిలో కలిపేశారు. విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే వాళ్లు విచారణ ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. తండ్రి బిడ్డను చంపితే తల్లి చెప్పిన నిజం చెప్పి తన భర్తను అరెస్ట్ చేయించింది. ఇంతకీ అసలు కథ ఏంటనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Buliding down chaild: పైకప్పు నుంచి పిల్లాడిని కిందకి విసిరేసిన తల్లి.. తరువాత ఏమైందంటే..
గుర్నీత్‌ను గొంతు కోసి చంపేశాడు..
అశోక్ నగర్ జిల్లాలోని బహదూర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గీలారోపా గ్రామానికి చెందిన గుర్నీత్ (17) ను ఆమె తండ్రి బలిహర్ సింగ్ గొంతు కోసి చంపాడు. ఈసందర్భంగా పలువురు పోలీసులు మాట్లాడుతూ.. హత్య తర్వాత నిందితుడు కేసును ఆత్మహత్యగా చూపించడానికి మృతదేహాన్ని ఉరికి వేలాడదీసి, ఆపై హడావిడిగా దహనం చేశాడని చెప్పారు. గుర్నీత్ తనకు నచ్చిన వివాహం చేసుకోవాలనుకుంది. కానీ ఆమె నిర్ణయాన్ని తన తండ్రి వ్యతిరేకించాడు. దీంతో వాళ్లిద్దరి మధ్య ఈ విషయంలో తీవ్రస్థాయిలో అభిప్రాయ భేదాలు వచ్చియి. గుర్నీత్ హత్యకు 12 రోజుల ముందు వాళ్ల ఇంట్లో గొడవ జరిగింది. తన బిడ్డ మెండితనంతో ఆయనకు చాలా కోపం వచ్చి, ఆగస్టు 23 మధ్యాహ్నం సమయంలో ఆమె నిద్రపోతున్నప్పుడు గొంతు కోసి చంపాడని చెప్పారు. మృతురాలి తల్లిని ప్రశ్నించినప్పుడు మొత్తం సంఘటన గురించి చెప్పిందన్నారు. ఆగస్టు 23 మధ్యాహ్నం కుమార్తె గుర్నీత్ గదిలో నిద్రిస్తుండగా, తండ్రి బలిహర్ సింగ్ ఆమె గదిలోకి ప్రవేశించి తనను గొంతు కోసి చంపాడని చెప్పింది. తన భర్త, బిడ్డను చంపడం చూసిన ఆమె చాలా భయపడినట్లు చెప్పింది.
హత్య గురించి ఎవరికైనా చెబితే, తనను, మిగిలిన పిల్లలను కూడా చంపేస్తానని బెదిరించినట్లు ఆమె పేర్కొంది. నిందితుడు బలిహర్ సింగ్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మరణించిన గుర్నీత్ రెండవ సంతానం. మృతురాలి తండ్రి ఆమెకు 8 నెలల క్రితం తనకు నచ్చిన అబ్బాయితో తన వివాహం ఏర్పాటు చేశాడు. కానీ గుర్నీత్‌కు ఈ సంబంధం ఇష్టం లేదని, తనకు నచ్చిన అబ్బాయిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పడంతో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించగా, విచారణలో తండ్రి తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు.
READ ALSO: Xi Jinping India Letter: భారత్‌కు జిన్‌పింగ్ రహస్య లేఖ.. అమెరికా గురించి ఏం చెప్పారంటే..