NTV Telugu Site icon

Stock Market: లాభాల్లో సూచీలు.. ట్రేడింగ్లో సెన్సెక్స్, నిఫ్టీ

Stock

Stock

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఇవాళ భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ సూచీల్లోని సానుకూల పవనాలు మన మార్కెట్లకు సపోర్టుగా నిలుస్తున్నాయి. ఆరంభ ట్రేడింగ్‌లోనే రెండు సూచీలు రికార్డు గరిష్ఠాలను తాకేశాయి. 79,787 దగ్గర సెన్సెక్స్‌, 24,209 వద్ద నిఫ్టీ ట్రేడింగ్‌ను స్టార్ట్ చేశాయి. తర్వాత కొనుగోళ్లతో తొలిసారి 80,000 కీలక మైలురాయిని సెన్సెక్స్‌ తాకి 80,074 వద్ద సరికొత్త రికార్డును సృష్టించింది. నిఫ్టీ 24,296 దగ్గర తాజా రికార్ట్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.53 దగ్గర స్టార్ట్ అయింది. ఉదయం 9: 54 గంటల సమయంలో సెన్సెక్స్‌ 592 పాయింట్ల లాభంతో 80,033, నిఫ్టీ 175 పాయింట్లు ఎగబాకి 24,299 వద్ద కొనసాగుతున్నాయి.

Read Also: Biden- Trump Debate: ట్రంప్తో డిబేట్లో నిద్రపోయినంత పనైంది.. తడబాటుపై బైడెన్ రియాక్షన్..!

సెన్సెక్స్‌-30 సూచీలో కోటక్ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, నెస్లే ఇండియా, ఎం అండ్‌ ఎం, ఐటీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. టీసీఎస్‌, టాటా మోటార్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌గ్రిడ్‌, రిలయన్స్, టైటన్‌, మారుతీ, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ నష్టాల్లో స్టార్ట్ అయ్యాయి.

Read Also: Kalki2898AD: ఓరినాయనో.. త్రీడీ కళ్ల జోళ్ల తో నిర్మాతకు కోటి రూపాయలా..!

కాగా, అమెరికా స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగియగా.. నేడు ఆసియా సూచీలూ సానుకూలంగా ట్రేడింగ్ లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 86.72 డాలర్ల దగ్గర కొనసాగుతుంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా రూ.2,000 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మకాలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.648 కోట్ల వాటాలను కొనుగోలు చేసేశారు.