EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
- ప్రీమియం లేకుండానే రూ.7 లక్షల జీవిత బీమా
- EPF సభ్యులకు తెలియని అద్భుత ప్రయోజనం
- అత్యవసర పరిస్థితుల్లో కుటుంబానికి ఇది ఎంతో ఉపయోగపడే ఆర్థిక భద్రత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భవిష్యత్తు భద్రంగా, కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వాలంటే జీవిత బీమా అనేది చాలా ముఖ్యం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అయితే దీనికోసం ఎంతో కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కానీ అసలు ప్రీమియమే చెల్లించకుండా, ఫ్రీగా 7 లక్షల రూపాలయల బీమా కవరేజీ పొందొచ్చు తెలుసా? అసలు ఇలాంటి పథకం ఉందా? అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మీకు పీఎఫ్ ఖాతా ఉంటే చాలు ఉచితంగా 7 లక్షల జీవిత బీమా అందుకోవచ్చు.
ఉద్యోగం చేసేవారి శాలరీ నుంచి ప్రతి నెలా కొంత మొత్తం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ లో జమ అవుతుంది. అయితే, అదే ఈపీఎఫ్ ఖాతాతో ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే రూ.7 లక్షల వరకు జీవిత బీమా కవరేజీ కూడా లభిస్తుందని చాలా మందికి తెలియదు. ఈ ప్రయోజనం ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా పొందొచ్చు. దీనిని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నిర్వహిస్తుంది. ఉద్యోగి సేవలో ఉండగానే మరణిస్తే, అతని కుటుంబ సభ్యులకు లేదా నామినీకి ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం లక్ష్యం.
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
EDLI పథకం అంటే ఏమిటి?
EDLI (Employees’ Deposit Linked Insurance Scheme) 1976లో ప్రారంభించిన జీవిత బీమా పథకం. EPF ఖాతా కలిగిన ప్రతి ఉద్యోగికి ఈ బీమా కవరేజీ ఆటోమేటిక్‌గా వర్తిస్తుంది. ఈ పథకం కోసం ఉద్యోగి ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎలాంటి ప్రీమియం కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ఈ బీమా కోసం ప్రీమియం ఎవరు చెల్లిస్తారు?
EDLI పథకంలో ఉద్యోగి నుంచి ఎలాంటి మొత్తాన్ని వసూలు చేయరు. ఈ బీమా కోసం యజమాని (Employer) ఉద్యోగి వేతనంలో 0.5 శాతం వరకు EPFOకు చెల్లిస్తారు. గరిష్టంగా నెలకు రూ.75 వరకు మాత్రమే ఈ చెల్లింపు ఉంటుంది.
ఎవరు ఈ ప్రయోజనానికి అర్హులు?
EPF సభ్యులుగా ఉన్న ఉద్యోగులందరూ
ఉద్యోగ సమయంలో EPF కాంట్రిబ్యూషన్ కొనసాగుతున్న వారు
ఉద్యోగి సేవలో ఉండగానే మరణించిన సందర్భంలో నామినీ లేదా చట్టబద్ధ వారసులు
ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో EPF వర్తించే సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తిస్తుంది.
ఎంత వరకు బీమా మొత్తం లభిస్తుంది?
EDLI పథకం కింద.. కనీస బీమా ప్రయోజనం రూ.2.5 లక్షలు.. గరిష్ట బీమా ప్రయోజనం రూ.7 లక్షలు అందుబాటులో ఉంటాయి.
బీమా మొత్తం ఎలా లెక్కిస్తారు?
ఉద్యోగి మరణానికి ముందు చివరి 12 నెలల సగటు వేతనం ఆధారంగా బీమా మొత్తాన్ని నిర్ణయిస్తారు.
సాధారణంగా గత 12 నెలల సగటు నెలవారీ వేతనం × 35 రెట్లు
అదనంగా బోనస్ మొత్తం
మొత్తం కలిపి గరిష్టంగా రూ.7 లక్షల వరకు చెల్లిస్తారు.
EDLI క్లెయిమ్ ఎలా చేయాలి?
ఉద్యోగి మరణించిన తర్వాత నామినీ లేదా చట్టబద్ధ వారసులు క్లెయిమ్ చేసుకోవచ్చు.
అవసరమైన పత్రాలు:
Form 5IF
ఉద్యోగి మరణ ధ్రువీకరణ పత్రం
నామినీ గుర్తింపు పత్రం
బ్యాంక్ ఖాతా వివరాలు
రద్దు చేసిన చెక్ (Cancelled Cheque)
అవసరమైతే వారసత్వ ధ్రువీకరణ పత్రం
ఈ పత్రాలను సంబంధిత EPFO ప్రాంతీయ కార్యాలయంలో సమర్పించాలి.
క్లెయిమ్ సెటిల్మెంట్కు ఎంత సమయం పడుతుంది?
EPFO మార్గదర్శకాల ప్రకారం, EDLI క్లెయిమ్‌లను సాధ్యమైనంత వరకు 20 రోజుల్లోపు పరిష్కరించాలి.
ఉద్యోగులు ఇప్పుడే చేయాల్సిన ముఖ్యమైన పని
చాలా కుటుంబాలు ఈ ప్రయోజనం గురించి తెలియక క్లెయిమ్ చేయలేకపోతున్నాయి. అందుకే ప్రతి EPF సభ్యుడు.. తన EPF ఖాతాలో e-Nomination తప్పనిసరిగా నమోదు చేయాలి. నామినీ వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలి. కుటుంబ సభ్యులకు ఈ బీమా గురించి ముందుగానే తెలియజేయాలి
EPF అనేది కేవలం పదవీ విరమణ పొదుపు పథకం మాత్రమే కాదు. దానితో పాటు ఎలాంటి అదనపు ప్రీమియం లేకుండానే రూ.7 లక్షల వరకు జీవిత బీమా రక్షణ కూడా లభిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో కుటుంబానికి ఇది ఎంతో ఉపయోగపడే ఆర్థిక భద్రత. కాబట్టి ప్రతి ఉద్యోగి EDLI పథకం గురించి అవగాహన పెంచుకుని, నామినీ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవడం ఎంతో ముఖ్యం.
తాజావార్తలు
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!