SBI: గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్బీఐ.. వాటిపై వడ్డీ రేట్లు పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)… తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది.. రికరింగ్ డిపాజిట్లపై (ఆర్డీ) వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది… పెంచిన వడ్డీ రేట్లు ఈ నెల 14వ తేదీ నుంచి అమలులోకి వచ్చాఇ.. కనీసం రూ.100 డిపాజిట్ కోసం ఎస్బీఐలో ఆర్డీని తెరవవచ్చు. ఈ ఆర్డీ ఖాతాలను 12 నెలల నుండి 10 సంవత్సరాల కాలవ్యవధితో ఉంటుంది.. ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) లాగానే, సీనియర్ సిటిజన్లకు అన్ని కాల వ్యవధిలో అదనపు వడ్డీని అందిస్తోంది ఎస్బీఐ. రికరింగ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు సాధారణ ప్రజలకు 5.3 శాతం – 5.5 శాతం మధ్య మారుతూ ఉండగా.. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటు వర్తిస్తుంది.
Read Also: Somu Veerraju: అందుకే రోడ్లు వేయరు, పంట కాలువలు, డ్రెయిన్లు క్లీన్ చేయరు..!
Also Read
- Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
- PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
- CKYC: బ్యాంకు కస్టమర్స్ కు అలర్ట్.. మీ CKYC నంబర్ తెలుసా?.. ఇలా తెలుసుకోండి
ఒక ఏడాది నుండి రెండేళ్ల కంటే తక్కువ కాల వ్యవధిలో ఆర్డీపై వడ్డీ రేటు 5.3 శాతంగా ఉండగా.. రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు కాలవ్యవధిలోని డిపాజిట్లపై వడ్డీ రేటును గతంలో 5.20 శాతం నుంచి 15 బేసిస్ పాయింట్లు పెంచి 5.35 శాతం చేశారు.. మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు కాలవ్యవధిలోని డిపాట్లపై రేటు 5.45 శాతం, ఐదు సంవత్సరాల నుండి 10 సంవత్సరాల కాలవ్యవధికి, వడ్డీ రేటు 5.50 శాతంగా ఉంది.. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు పెంపు తర్వాత దేశంలోని అతిపెద్ద రుణదాత ఎస్బీఐ తన డిపాజిట్ మరియు రుణ రేట్లను పెంచింది. ఎంపిక చేసిన కాలవ్యవధి కోసం రూ.2 కోట్ల కంటే తక్కువ దేశీయ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 0.20 శాతం పెంచినట్లు ఎస్బీఐ తెలిపింది.
రిటైల్ దేశీయ టర్మ్ డిపాజిట్లపై (రూ.2 కోట్ల కంటే తక్కువ) సవరించిన వడ్డీ రేట్లు జూన్ 14, 2022 నుండి అమల్లోకి వస్తాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వెబ్సైట్లో పేర్కొంది. 211 రోజుల నుండి 1 సంవత్సరంలోపు డిపాజిట్ల కోసం, రుణదాత 4.60 శాతం వడ్డీ రేటును అందిస్తారు, ఇది ముందు 4.40 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్లకు ఇంతకుముందు 4.90 శాతం ఉన్న వడ్డీ 5.10 శాతం అందించబడుతుంది. అదేవిధంగా, 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల లోపు దేశీయ టర్మ్ డిపాజిట్ల కోసం, కస్టమర్లు 0.20 శాతం వరకు 5.30 శాతం వడ్డీని పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు, వడ్డీ రేటు ఇదే మార్జిన్‌తో 5.80 శాతంగా ఉంటుంది. 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధిలో ఎస్బీఐ వడ్డీ రేటును 5.20 శాతం నుండి 5.35 శాతానికి పెంచింది, అయితే సీనియర్ సిటిజన్లు 5.70 శాతం నుండి 5.85 శాతానికి పొందవచ్చు.
ఇక, రుణదాత ఎంపిక చేసిన టేనర్‌ల కోసం రూ.2 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ దేశీయ బల్క్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.75 శాతం వరకు సవరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గత వారం రెపో రేటును 0.50 శాతం నుంచి 4.90 శాతానికి పెంచింది. రెపో అనేది బ్యాంకులకు ఆర్బీఐ విధించే స్వల్పకాలిక రుణ రేటు అనే విషయం తెలిసిందే. ఎస్బీఐ జూన్ 15, 2022 నుండి అమల్లోకి వచ్చే విధంగా ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్లు (MCLR) యొక్క మార్జినల్ కాస్ట్ ఆఫ్ 0.20 శాతం వరకు సవరించింది. ఎస్బీఐ తన వెబ్సైట్ ప్రకారం జూన్ 15, 2022 నుండి రెపో లింక్డ్ లెండింగ్ రేటు (RLLR)ని కూడా పెంచింది. జూన్ 8న ఆర్బీఐ రెపో రేటు సవరణ తర్వాత పలు బ్యాంకులు రేట్లు పెంచిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
-
Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
-
David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన స్టార్ క్రికెటర్.. నేరం అంగీకారం.. శిక్షపై ఉత్కంఠ..!
-
CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
-
Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!