ప్రముఖ దేశీయ బ్యాంక్ ఎస్బిఐ తమ కస్టమర్లకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతూ వస్తుంది.. తాజాగా మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రభుత్వ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఇందుకు స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్ సైతం తీసుకొస్తున్నాయి.. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తుంది.. SBI. సీనియర్ సిటిజన్ల కోసం ‘వి కేర్’ స్కీమ్‌ను లాంచ్ చేసింది. దీనితో ఎక్కువ వడ్డీతో పాటు చాలా రకాల ప్రయోజనాలు అందిస్తోంది. కస్టమర్ల పెట్టుబడిని డబుల్ చేసే ఎఫ్‌డీగా ఇది ఆదరణ దక్కించుకుంటోంది..
ఈ స్కీమ్ లో 5 ఏళ్ల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్ చేసుకొనే అవకాశం ఉందని తెలుస్తుంది.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకు 7.50% వడ్డీ రేటును అందిస్తుంది. నెట్ బ్యాంకింగ్, యోనో యాప్ లేదా లోకల్ బ్రాంచ్ మాన్యువల్‌గా ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు.. ఇకపోతే ఎఫ్‌డీపై వడ్డీని నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన స్వీకరించవచ్చు. అయితే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ డిడక్ట్ చేసిన తర్వాత ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వడ్డీ అందిస్తారు. రెగ్యులర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండే టెన్యూర్‌పై వడ్డీ రేట్లు 3.50% నుంచి 7.50% మధ్య వడ్డీ రేట్లు ఉన్నాయి..
ఈ ఎస్‌బీఐ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే 10 సంవత్సరాలలో కస్టమర్ల డబ్బు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, 10 సంవత్సరాల తర్వాత రూ.10 లక్షల కంటే ఎక్కువ అందుకుంటారు. ఈ కాలంలో దాదాపు రూ.5 లక్షల వడ్డీని పొందుతారు. ఎందుకంటే బ్యాంక్ 10 సంవత్సరాల టెన్యూర్‌తో రెగ్యులర్ ఎఫ్‌డీలపై 6.5% వడ్డీని అందిస్తుంది.. ఈ స్కీమ్ లో లోన్ కూడా తీసుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు.. మీకు ఇంట్రెస్ట్ ఉంటె మీరు కూడా ఇందులో డిపాజిట్ చేసుకోండి..