SBI Downtime: ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 25, 2025 శనివారం తెల్లవారుజామున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన డిజిటల్ బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోతాయని బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. రేపు తెల్లవారుజామున 1:10 నుంచి 2:10 (IST) వరకు UPI, IMPS, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS వంటి అనేక సేవలు దాదాపు 60 నిమిషాల పాటు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని SBI తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ప్రకటించింది. నిర్వహణ పూర్తయిన తర్వాత అన్ని సేవలు తెల్లవారుజామున 2:10 గంటలకు తిరిగి ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది.
READ ALSO: CM Chandrababu: తెలుగు జాతికి తిరుగే లేదు.. ప్రపంచంలో నెంబర్ 1గా తయారవుతుంది!
ఎస్బీఐ ప్రకటనలో ఏం ఉంది..
ఎస్బీఐ ప్రకటనలో ఏం ఉందంటే.. “షెడ్యూల్ చేసిన నిర్వహణ కార్యకలాపాల కారణంగా, 25.10.2025న ఉదయం 01:10 నుంచి 02:10 వరకు UPI, IMPS, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS వంటి బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. ఈ సేవలు ఉదయం 02:10 గంటలకు తిరిగి ప్రారంభం అవుతాయి.” ఈ సమయంలో SBI కస్టమర్లు ATM, UPI లైట్ సేవలను ఉపయోగించుకోవాలని బ్యాంకు సలహా ఇచ్చింది. SBI మొదట అక్టోబర్ 24న తెల్లవారుజామున 12:15 నుంచి 1:00 వరకు నిర్వహణకు ప్రణాళిక వేసింది. కానీ తరువాత దానిని అక్టోబర్ 25కి ఒక రోజు వాయిదా వేసింది. మీరు అక్టోబర్ 25 రాత్రి లావాదేవీ చేయవలసి వస్తే.. UPI లైట్ లేదా ATMలను ఉపయోగించాలని సూచించారు.
SBI UPI లైట్ గురించి తెలుసా..
1. UPI లైట్ అంటే ఏమిటి: UPI లైట్ అనేది డిజిటల్ వాలెట్ సర్వీస్. ఇది పిన్ నమోదు చేయకుండానే రూ.1000 వరకు చిన్న లావాదేవీలను తక్షణమే పూర్తి చేయడానికి అనుమతిస్తుంది.
2. ఎలా యాక్టివేట్ చేయాలి: BHIM SBI Pay యాప్ తెరిచి, మీ వాలెట్‌కు డబ్బును జోడించడానికి UPI లైట్ విభాగానికి వెళ్లాలి. డబ్బు లోడ్ అయిన తర్వాత సేవ అవి ఈ వాలెట్‌లో జమ అవుతాయి.
3. డీయాక్టివేట్ చేయవచ్చా: వినియోగదారుడు BHIM SBI పే యాప్ నుంచి దీనిని ఎప్పుడైనా డీయాక్టివేట్ చేయవచ్చు.
4. UPI లైట్ లావాదేవీలు బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో కనిపిస్తాయా: ఈ లావాదేవీలు వాలెట్ నుంచి జరిగినవి కాబట్టి, స్టేట్‌మెంట్‌లో వాలెట్ లోడ్ ఎంట్రీ మాత్రమే కనిపిస్తుంది.
5. UPI లైట్ లావాదేవీ పరిమితి:
* ప్రతి లావాదేవీకి గరిష్టంగా రూ.1,000 ఉంటుంది.
* ఒక రోజులో మొత్తం వినియోగం రూ.10 వేల వరకు ఉంటుంది.
* గరిష్ట వాలెట్ బ్యాలెన్స్ రూ.5 వేలు.
బ్యాంకు నిర్వహణ పనుల సమయంలో కస్టమర్లు భయపడవద్దని SBI ప్రకటనలో పేర్కొంది.
READ ALSO: Apple Fine UK: యాపిల్‌కు రూ.1.75 వేల కోట్ల జరిమానా
Due to scheduled maintenance activity, our services UPI, IMPS, YONO, Internet Banking, NEFT & RTGS will be temporarily unavailable from 01:10 hrs to 02:10 hrs on 25.10.2025 (60 Minutes). These services will resume by 02:10 hrs on 25.10.2025 (IST).
Meanwhile, customers are…
— State Bank of India (@TheOfficialSBI) October 23, 2025