Indian Rupee: రూపాయి పతనంపై దయచేసి ఆర్బీఐ జోక్యం చేసుకోవద్దు..!
- డాలర్ పెరుగుదలతో పతనమైతున్న రూపాయి విలువ..
- రూపాయి పతనంపై ఆర్బీఐ జోక్యం చేసుకుంటే.. ఎగుమతులపై ప్రభావం పడే ఛాన్స్..
- దేశీయంగా వినియోగం పెంచేందుకు మద్దతు ఇచ్చే చర్యలపై దృష్టి పెట్టాలి: రఘురాం రాజన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Rupee: రోజు రోజుకు అమెరికా డాలరు బలం పుంజుకోవడంతో.. భారత రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. రూపాయి విలువను కాపాడటానికి ఆర్బీఐ జోక్యం చేసుకోవడం వల్ల భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇందుకు బదులుగా మరిన్ని ఉద్యోగాలను సృష్టించి.. దేశీయంగా వినియోగం పెంచేందుకు తగిన మద్దతు ఇచ్చే చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఎందుకంటే, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తీసుకుంటున్న చర్యలతో అంతర్జాతీయంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంది.. అలాగే, ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన విధంగానే ఇమిగ్రేషన్, టారిఫ్‌లపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని రాఘురామ్ రాజన్ పేర్కొన్నారు.
Read Also: Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి!
Also Read
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
అలాగే, ఇతర కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలరు క్రమంగా బలపడటం.. వివిధ దేశాల ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరికలే దీనికి ప్రధాన కారణం. టారిఫ్‌లు పెంచితే, ఇతర దేశాల నుంచి యూఎస్ కి దిగుమతులు తగ్గిపోవడం.. కరెంట్ ఖాతా లోటు, వాణ్యి లోటు కూడా తగ్గడం వల్ల ప్రపంచంలో తక్కువ డాలర్లు ఉంటాయి.. దీంతో డాలరు విలువ ఇంకా బలోపేతం అవుతుంది. యూఎస్ కి ఎగుమతులు చేయలేక కంపెనీలు అన్నీ.. అమెరికాలోనే ఉత్పత్తులు చేయడానికి మొగ్గుచూపుతాయి.
Read Also: MB Foundation : నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు సందర్భంగా MB ఫౌండేషన్ స్పెషల్ డ్రైవ్
అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పటి వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోలేదని మాజీ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ఇక, రూపాయి విలువను నిర్దేశిత స్థాయిలో ఉంచడానికి జోక్యం చేసుకోలేమన్నారు. అలాగే, మార్కెట్‌కు తగినట్లుగా రూపాయి తన సొంత స్థాయిని కనిపెట్టడానికి ఆర్బీఐ యత్నిస్తుంది. ఒక వేళ రూపాయి విషయంలో ఆర్బీఐ జోక్యం చేసుకుంటే.. భారీ ఊగిసలాటకు దారి తీయడంతో పాటు ఎగుమతిదార్లకు ఇబ్బందులు కలిగిస్తాయి. ఇక, ఇటీవల ఆర్థిక మందగమనంపై ఆందోళన పడొద్దు.. గత కొన్నేళ్లలో బలమైన వృద్ధి నమోదు చేస్తున్నాం.. స్థిరమైన వృద్ధిని కొనసాగించేందుకు భారీ పెట్టుబడులు, వినియోగ వృద్ధి చాలా అవసరమని ఆర్బీఐ మాజీ గవర్నర్ అన్నారు.
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!